Sriramsagar Project | శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు స్వల్ప ఇన్​ఫ్లో.. రైతుల్లో చిగురిస్తున్న ఆశలు

ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్ప ఇన్​ఫ్లో వచ్చి చేరుతోంది.

shashi kiran Mottala

అక్షరటుడే, ఆర్మూర్ : Sriramsagar Project |ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్ప ఇన్​ఫ్లో వచ్చి చేరుతోంది. తెలంగాణ (Telangana)తో పాటు మహారాష్ట్రలో తేలికపాటి వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి వరద వస్తోంది.

Sriramsagar Project | రైతుల్లో చిగురిస్తున్న ఆశలు..

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1,091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 1,064.50 అడుగుల (15.4 టీఎంసీలు)  నీరు నిల్వ ఉంది. గతేడాది ఇదే రోజు 21.029 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2,199 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వచ్చి చేరుతుండగా ఆవిరి, మిషన్ భగీరథ ద్వారా 751 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది. ప్రాజెక్టులో నీటిమట్టం నిరాశాజనకంగా ఉండడంతో ఆయకట్టు కింది ఆరు లక్షల ఎకరాల రైతులు ఆందోళన వ్యక్తం చెందుతున్నారు. అయితే తాజాగా ఇన్​ఫ్లో వస్తుండటంతో వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు పడితే జలాశయంలోకి వరద పెరిగే అవకాశం ఉంది.

Sriramsagar Project

ఇది కూడా చదవండి..: TPCC Chief | 70వేల ఉద్యోగాలిచ్చాం.. బీఆర్​ఎస్​తో చర్చకు సిద్ధం : టీపీసీసీ చీఫ్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *