Rahul Gandhi Arrest Protest | రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ నాయకుల ధర్నా

జంతర్​మంతర్​ వద్ద రాహుల్​గాంధీని అరెస్ట్​ చేసినందుకు నిరసనగా జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్​ నాయకులు నిరసనలకు దిగారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బాల్కొండ/ఆర్మూర్​: Rahul Gandhi Arrest Protest | జంతర్​మంతర్​ వద్ద రాహుల్​గాంధీని అరెస్ట్​ చేసినందుకు నిరసనగా జిల్లావ్యాప్తంగా (Nizamabad) కాంగ్రెస్​ నాయకులు నిరసనలకు దిగారు. రాస్తారోకోలు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Rahul Gandhi Arrest Protest | ఆర్మూర్​ పట్టణంలో..

పట్టణంలోని కెనాల్​ వంతెన వద్ద కాంగ్రెస్​ పార్టీ నాయకులు రాస్తారాకో నిర్వహించారు. నీట్​ పేపర్​ లీక్​కు (NEET Issue) నిరసనగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రధాన్​ను రాజీనామా చేయాలని ఢిల్లీలో డిమాండ్​ చేస్తున్న రాహుల్​గాంధీని అరెస్ట్​ చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రితో రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు.

Rahul Gandhi Arrest Protest | బాల్కొండ మండల కేంద్రంలో..

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాల్కొండ మండల కేంద్రంలోని పాత జాతీయ రహదారిపై బుధవారం ధర్నా నిర్వహించారు. పార్టీ నేతలు రాహుల్ గాంధీ అరెస్టును, ఢిల్లీలో విద్యార్థులపై జరిగినట్లు పేర్కొన్న లాఠీచార్జీని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. నిరసన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేయడానికి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు కాంగ్రెస్ నాయకులు రహదారిపై రాస్తారోకో నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చాట్ల నరేష్, ప్రధాన కార్యదర్శి యూనస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్, నాయకులు చేని నగేష్, వెంకట్ గౌడ్, అరవింద్, మోహన్ రెడ్డి, ఇమ్రాన్, సయ్యద్ మజారుద్దీన్, సయ్యద్ రియాజ్, షేక్ వహాబ్, శ్రీనివాస్, సంజీవ్ గౌడ్, హరికృష్ణ, విక్కీ ముదిరాజ్, కపిల్, రవీందర్ గౌడ్, కిషన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

akash11

ఇది కూడా చదవండి: #RamCharan & #UpasanaKonidela spotted at the Hyderabad Airport

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *