అక్షరటుడే, వెబ్‌డెస్క్ : REDCO DE | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. అవినీతి అధికారుల భరతం పడుతున్నారు. బాధితుల ఫిర్యాదుమేరకు లంచాలు తీసుకుంటున్న అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. అంతేగాకుండా లంచాలు తీసుకొని భారీగా ఆస్తులు కూడబెట్టిన పెద్ద పెద్ద అధికారుల పని పడుతున్నారు. అక్రమాస్తుల కేసులు నమోదు చేసి దాడులు చేస్తున్నారు. దీంతో అవినీతి అధికారులు భయపడుతున్నారు. తాజాగా రెడ్కో డీఈ ముత్యం వెంకట రమణా నివాసాల్లో సోదాలు చేసి భారీగా అక్రమాస్తులు గుర్తించారు.
రెడ్కో డీఈ వెంకటరమణ లంచాలు, కమీషన్లు తీసుకొని భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ (ACB)కి ఫిర్యాదులు అందాయి. దీంతో బుధవారం తెల్లవారు జామున నుంచి అధికారులు సోదాలు చేశారు. ఆయన ఇంటితో పాటు బంధువులు, సన్నిహితుల ఇళ్లలో దాడులు చేశారు. ఏకకాలంలో 15 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఆయన భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. వెంకట రమణ భార్య పేరుపై నిర్మాణంలో ఉన్న 10 ఫ్లాట్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఖానామెట్ గుట్టల బేగంపేట్‌లో G+5 కమర్షియల్ భవనం, ఆంజనేనగర్, మూసాపేట్‌లో 4 రెసిడెన్షియల్ ఫ్లాట్స్, G+3 భవనం ఉన్నట్లు గుర్తించారు. భారీగా బంగారం, డైమండ్ జువెల్లరీ, నగదు, ఫారిన్ లిక్కర్ స్వాధీనం చేసుకున్నారు.
REDCO DE | అప్పటి నుంచి నిఘా
ఏసీబీ డీఎస్పీ (ACB DSP) మాజీద్ అలీ ఖాన్ మాట్లాడుతూ.. 2019లో ముత్యం వెంకటరమణ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడని తెలిపారు. అప్పటి నుంచి అతడిపై నిఘా ఉంచామన్నారు. తాజాగా దాడులు చేపట్టినట్లు తెలిపారు. ఎస్పీడీసీఎల్ ఉద్యోగి అయని వెంకటరమణ ప్రస్తుతం డిప్యుటేషన్‌పై రెడ్కోలో పని చేస్తున్నట్లు చెప్పారు. వివిధ ప్రాంతాల్లో విద్యుత్ శాఖలో పని చేసిన సమయంలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఆయన నివాసంలో కియా, మహీంద్రా, బెలినో కంపెనీలకు చెందిన మూడు కార్లను గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
దీనిని కూడా చదవండి : Gig Workers Issues | గిగ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి : కవిత