అక్షరటుడే వెబ్‌డెస్క్: Ganja Smuggling | ఖమ్మం జిల్లాలోని ( Khammam ) కల్లూరు పట్టణ శివారులో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి గంజాయి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఈ వివరాలను ఏసీపీ వసుంధర యాదవ్ వెల్లడించారు. కల్లూరు పట్టణంలో ఎస్సై హరిత తన సిబ్బందితో కలిసి బుధవారం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. స్థానిక శివారులోని కాశ్మీర శివాలయం ఖాళీ ప్రాంగణంలో ఆటో, రెండు బైక్‌లపై కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తూ కనిపించారు. పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించిన వారిలో ఐదుగురిని వెంబడించి పట్టుకున్నారు. మరో ఇద్దరు ద్విచక్ర వాహనాలను వదిలి పరారయ్యారు.
Ganja Smuggling | 23 కేజీల ఎండు గంజాయి ..
నిందితుల ఆటోను తనిఖీ చేయగా 12 ప్యాకెట్లలో దాచి ఉంచిన 23 కేజీల ఎండు గంజాయి లభ్యమైంది. తహసీల్దార్, గ్రామపంచాయతీ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించి.. రూ.11.55 లక్షల విలువైన గంజాయితో పాటు ఒక ఆటో, రెండు బైక్‌లు, 5 సెల్ఫోన్లు, రూ.5,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Ganja Smuggling | నిందితుల వివరాలు..
పట్టుబడిన నిందితులను పాల్వంచకు చెందిన మహ్మద్ అన్వర్, మహ్మద్ వజీర్ ఖాన్, కల్లూరుకు చెందిన షేక్ ముజాహిద్ పాషా, హైదరాబాద్‌కు చెందిన దేవరం రాకేశ్, మహ్మద్ ఆదిల్‌గా గుర్తించారు. పరారీలో ఉన్న ఒడిశా మల్కాన్గిరికి చెందిన రాజు, కార్తీక్‌ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో ప్రతిభ కనబరిచిన సత్తుపల్లి సీఐ ముత్తలింగయ్య, ఎస్సై హరితతో పాటు ఇతర సిబ్బందిని ఏసీపీ అభినందించారు.
ఇది కూడా చదవండి: Pocharam Bhaskar Reddy | ఘనంగా డీసీసీబీ మాజీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు