అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Madhavnagar ROB | మాధవనగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని టీడీపీ(TDP) మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బక్కిని నర్సింలు విమర్శించారు. నగర శివారులోని(Nizamabad) మాధవనగర్రైల్వే బ్రిడ్జి వద్ద జిల్లా టీడీపీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
Madhavnagar ROB | ఏళ్లుగా సాగుతున్న పనులు..
ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీలోపు ఆర్వోబీ పనులు పూర్తి కావాల్సి ఉండగా.. నత్తనడకన సాగడంపై నర్సింలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వంతెన నిర్మాణానికి నిధులు విడుదల చేస్తామని పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం తప్పితే కార్యరూపం దాల్చడం లేదని పేర్కొన్నారు. పనులు పెండింగ్‌లో పడడంతో ముఖ్యంగా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల ప్రజలకు తీవ్ర అసౌకర్యం ఏర్పడుతుందన్నారు. 2022 జనవరి 27వ తేదీన పనుల ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు కూడా పనులు కొనసాగుతుండడంపై వారు అసహనం వ్యక్తం చేశారు.
Madhavnagar ROB | వంతెన వద్ద అస్తవ్యస్తం
వంతెన వద్ద కనెక్టివిటీ రోడ్డు సరిగ్గా లేక దుమ్ము, బురద, ట్రాఫిక్ రద్దీ కారణంగా ప్రజలు నిత్యం అవస్థలు పడుతున్నారన్నారు. అంబులెన్స్‌లు, స్కూల్ బస్సులు, అత్యవసర సమయాల్లో వెళ్లేందుకు చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ప్రభుత్వం వెంటనే నిధులు పూర్తిగా విడుదల చేసి ఆర్వోబీనీ పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకుడు దేగాం యాదాగౌడ్, నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జీ బొబ్బ నరసింహారావు, కర్ర వినోద్ కుమార్, గోపాల్ రెడ్డి, సోమనారాయణ రెడ్డి, రెంజర్ల సురేష్, రాఘవులు, మల్లికార్జున్, అంబిక సత్యనారాయణ, శ్రీనివాస్ బాబు, సచిన్ పటేల్, ఆనంద్, కల్లెడ గంగాధర్, బాలగంగాధర్, కృష్ణారెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: తెలంగాణ రక్షణ సేన నాయకుల అరెస్ట్