Nirmal Auto Driver Murder | సవతి తల్లితో వివాహేతర సంబంధం.. ఆటో డ్రైవర్​ హత్య

ఓ యువకుడిని సవతి తల్లి హత్య చేయించింది. వివాహేతర సంబంధమే ఇందుకు కారణమని పోలీసులు తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nirmal Auto Driver Murder | ఓ వ్యక్తి తన సవతి తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ బంధాన్ని ముగించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. అంతేగాకుండా అతడిని సుపారీ ఇచ్చి హత్య చేయించింది. ఈ ఘటన నిర్మల్​ జిల్లాలో చోటు చేసుకుంది.

Nirmal Auto Driver Murder | దారుణ హత్య

నిర్మల్​ (Nirmal) పట్టణంలో ఇటీవల ఆటో డ్రైవర్​ అస్లాం దారుణ హత్యకు గురయ్యాడు. ప్రయాణికులను తీసుకొని వెళ్తున్న అతడిని కొందరు వెంబడించి ఆపారు. ఆటో నుంచి బయటకు లాగి కత్తులతో పొడిచి చంపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని గుర్తించారు. అస్లాం సవతి తల్లితో పాటు హత్యకు పాల్పడిన నిందితులను అరెస్ట్​ చేశారు.

Nirmal Auto Driver Murder | అందరికి తెలియడంతో..

నిర్మల్​కు చెందిన అస్లాంఖాన్​ (28) తండ్రి 17 ఏళ్ల క్రితం అన్వరీ బేగం (41)ను రెండో వివాహం చేసుకున్నాడు. అస్లాంఖాన్​ ప్రస్తుతం ఆటో డ్రైవర్​గా పని చేస్తున్నాడు. అతడికి తన సవతి తల్లి అన్వరీ బేగంతో వివాహేతర సంబంధం ఏర్పడింది. అస్లాం తమ బంధానికి ముగింపు పలికి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఆమెకు చెప్పాడు. అయితే అందుకు ఆమె ఒప్పుకోలేదు. అవసరం అయితే డబ్బులు ఇస్తానని పెళ్లి చేసుకోవద్దని కోరింది. తమ బంధాన్ని కొనసాగించాలని చెప్పింది. అందుకు అతడు ఒప్పుకోకపోవడంతో చంపేస్తానని బెదిరించింది. ఈ విషయాన్ని అస్లాం తన బాబాయికి చెప్పాడు. దీంతో వారి మధ్య వివాహేతర బంధం విషయం కుటుంబ సభ్యులు, బంధువులకు తెలిసింది.

తన పరువు తీశాడని, మరో పెళ్లి చేసుకొని వెళ్లిపోతాడని అస్లాం ఖాన్​పై అన్వరీ బేగం పగ పెంచుకుంది. మహారాష్ట్రకు చెందిన ముఖీద్​కు రూ.6 లక్షల సుఫారీ మాట్లాడి అతడిని హత్య చేయించింది. జులై 15న హత్య జరగ్గా పోలీసులు కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి..: Rahul Gandhi Protest | మోదీ నివాసాన్ని ముట్టడించిన రాహుల్​గాంధీ దిష్టిబొమ్మ దహనం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *