అక్షరటుడే వెబ్‌డెస్క్: K Kavitha Comments | విద్యార్థుల విజయాన్ని సీఎం రేవంత్ రెడ్డి తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేశారు. యువతకు ఇచ్చిన హామీలపై ఎక్కడ నిలదీస్తారనే భయంతోనే కాంగ్రెస్ నాయకులు కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారని ఆరోపించారు.
K Kavitha Comments | విద్యార్థుల పోరాట ఫలితమే..
గత 36 రోజులుగా దేశవ్యాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత చేసిన ఉద్యమం అద్భుత విజయం సాధించిందని కవిత అన్నారు. విద్యార్థులు కోరుకున్నట్లుగానే కేంద్ర ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించేలా చేసిందని, ఇది నూటికి నూరు శాతం విద్యార్థుల విజయమేనని తెలంగాణ రక్షణ సేన భావిస్తోందని చెప్పారు.
K Kavitha Comments | రేవంత్ రెడ్డిపై విమర్శలు..
గతంలో యువతను మోసం చేసిన ఆయనపై తమకు ఎలాంటి నమ్మకం లేదని కల్వకుంట్ల కవిత విమర్శించారు. గతంలో అనేక సందర్భాల్లో యువతను, విద్యార్థులను మోసం చేసిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు 21 ఏళ్లకే యువతను పార్లమెంట్‌కు పంపాలనే ఆలోచన చేయడం సంతోషకరమని పేర్కొన్నారు. అయినప్పటికీ ఆయనపై తమకు ఎలాంటి నమ్మకం లేదని, ఏ బిల్లు పెట్టినా కేంద్రంతో లాలూచీ పడుతున్నారని ఆరోపించారు.ఇచ్చిన హామీలను ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదని, ఆ వైఫల్యాలను ప్రజలు మరిచిపోయేలా చేయడానికి కొవ్వొత్తులు పట్టుకుని నగర వీధుల్లో ఊరేగితే ఎవరూ నమ్మరని ఆమె మండిపడ్డారు.
విద్యార్థుల విజయాన్ని సీఎం తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటు
యువతకు ఇచ్చిన హామీలపై ఎక్కడ నిలదీస్తారోనని మీరే ఊరేగింపులు చేస్తారా?
తెలంగాణ యువతకు ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేసిన చరిత్ర మీది
ఇకనైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే తెలంగాణ యువత మిమ్మల్ని గద్దె దించటం ఖాయం
– తెలంగాణ… pic.twitter.com/CZRTcHicL6
— Kalvakuntla Kavitha Office (@OfficeOfKavitha) July 26, 2026
ఇది కూడా చదవండి: Mann Ki Baat | కార్గిల్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం.. ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ