అక్షరటుడే వెబ్‌డెస్క్: Rahul Gandhi Letter | దేశ రాజధాని ఢిల్లీలో జులై 20న శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై భద్రతా దళాలు జరిపిన లాఠీఛార్జ్, దాడి ఘటనపై లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు జులై 25న ఆయన ఓ బహిరంగ లేఖ రాశారు. మెరుగైన, పారదర్శక విద్యా వ్యవస్థ కోసం శాంతియుతంగా ఆందోళన చేపట్టిన విద్యార్థులపై భద్రతా దళాలు రాక్షసంగా దాడి చేశాయని, బాష్పవాయువు గోళాలు, పెల్లెట్ గన్లతో విచక్షణారహితంగా విరుచుకుపడ్డాయని లేఖలో మండిపడ్డారు. ఈ ఘటనలో వందలాది మంది విద్యార్థులు, మహిళా విద్యార్థినులు తీవ్రంగా గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులపై ప్రాణాంతక పెల్లెట్ తుపాకులు ఉపయోగించడం కలచివేసిందని తెలిపారు. 19 సంవత్సరాల సాహిల్ లోచాబ్ అనే విద్యార్థి పెల్లెట్ దాడి వల్ల కంటి చూపు కోల్పోయే ప్రమాదంలో ఉన్నాడని, స్వయంగా ఆయన్ను కలిసి పరామర్శించినట్లు వెల్లడించారు.
Rahul Gandhi Letter | రాహుల్ గాంధీ ప్రశ్నలు..
శాంతియుతంగా ఆందోళన చేపట్టిన విద్యార్థులపై బాష్పవాయువు గోళాలు, పెల్లెట్ గన్లతో విచక్షణారహితంగా దాడి చేయడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో, విద్యార్థులపై బలప్రయోగానికి హోంశాఖ మంత్రిగా అనుమతి ఇచ్చారా లేదా అని, మఫ్టీలో వచ్చి దాడి చేసిన వ్యక్తులు పోలీసులా లేక వాలంటీర్లా అని సూటిగా ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన హక్కును ఎవరూ హరించలేరని, విద్యార్థుల గొంతును నొక్కలేరని హెచ్చరించారు. కాగా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన మరుసటి రోజే రాహుల్ ఈ లేఖ సంధించడం హస్తిన రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Rahul Gandhi Writes to Amit Shah, Raises Questions on Student Assault
విద్యార్థులపై దాడికి బాధ్యులెవరో చెప్పాలి: అమిత్ షాకు రాహుల్ గాంధీ లేఖ
ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన దాడికి బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనపై పూర్తి జవాబుదారీతనం… pic.twitter.com/EGLA1EoqAz
— Congress for Telangana (@Congress4TS) July 26, 2026
ఇది కూడా చదవండి: Mann Ki Baat | కార్గిల్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం.. ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ