అక్షరటుడే, బోధన్: Labour Cards Registration | ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న కార్మికులు (brick workers) లేబర్ కార్డుల(labour cards) కోసం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అనంతరం వారికి కార్డులు అందజేయాలని సబ్ కలెక్టర్ వికాస్ మహతో (Sub Collector Vikas Mahato) అన్నారు. ఈ మేరకు శనివారం ఎడపల్లి(Yedapally) తహసీల్దార్‌తో కలిసి ఎడపల్లి మండలం మంగళ్‌పహాడ్ గ్రామంలోని ఇటుక బట్టీల ప్రాంతాలను సందర్శించారు.
Labour Cards Registration | కార్మికుల స్థితిగతులపై ఆరా..
సబ్ కలెక్టర్ కార్మికులతో మాట్లాడారు. లేబర్ కార్డుల కోసం వారి రిజిస్ట్రేషన్ స్థితి గురించి ఆరా తీశారు. చాలామంది కార్మికులు అప్పటికే రిజిస్టర్ అయి ఉన్నట్లు తెలుసుకున్నారు. ఇంకా మిగిలిపోయిన కార్మికుల వివరాలు సేకరించాలని తప్పనిసరిగా వారికి రిజిస్ట్రేషన్ చేయించాలని ఎడపల్లి తహశీల్దార్‌కు సూచించారు. ఏఎన్ఎంల ద్వారా ఇటుక బట్టీ కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.

ఇది కూడా చదవండి: Paddy Procurement | దొడ్డురకం ధాన్యం సేకరణలో ఇబ్బందుల్లేకుండా చూడాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

