అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: CP Sai Chaitanya | పోలీసుల ఇమేజ్ను పెంచేవిధంగా శాఖలో సిబ్బంది విధులు నిర్వర్తించాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. నగరంలోని మూడో టౌన్‌ను ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
CP Sai Chaitanya | రికార్డుల పరిశీలన..
స్టేషన్‌లోని రికార్డులు, అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల వివరాలను పరిశీలించిన సాయిచైతన్య, నాణ్యమైన దర్యాప్తు కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ, నగరం (Nizamabad)లో నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలన్నారు. సైబర్ నేరాలు, ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌ల వలలు, డ్రగ్స్ రహిత సమాజం, రోడ్డు ప్రమాదాల నివారణపై పాఠశాలలు, కళాశాలల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. దర్యాప్తులో ఆధునిక సాంకేతికతను భాగం చేసుకోవాలని స్పష్టం చేశారు. సిబ్బంది ప్రతి ఆర్నెళ్లకొకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, ప్రయాణాల్లో తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రకాష్ యాదవ్, టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్, ఎస్సైలు హరిబాబు, నారాయణ, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Podu Land | వేడుకున్నా అధికారులు కనికనించలేదని.. పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం