Kalyana Lakshmi Forgery | ‘కల్యాణలక్ష్మి’ కోసం సంతకాలు ఫోర్జరీ చేసిన ముగ్గురి అరెస్ట్​

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kalyana Lakshmi Forgery | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు (Kamareddy) అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఎస్పీ రాజేష్​ చంద్ర (SP Rajesha Chandra) మంగళవారం సాయంత్రం వివరాలు వెల్లడించారు.

Kalyana Lakshmi Forgery | గెజిటెట్​ ఆర్​ఎంవో సంతకం ఫోర్జరీ..

ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. భిక్కనూర్ (Bhikkanoor) మండలంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధికోసం పలువురు అర్హుల దరఖాస్తులపై గెజిటెడ్ ఆర్ఎంవో సంతకం ఫోర్జరీ జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు డీఎస్పీ మధుసూదన్ రావు (DSP) పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. విచారణలో నిందితులు మొత్తం 52 దరఖాస్తులను అధికారులకు సమర్పించినట్లు తేలింది. వాటిలో 36 మంది లబ్ధిదారులకు ఇప్పటికే ప్రభుత్వ ఆర్థిక సహాయం మంజూరైంది. మరో 18 దరఖాస్తులు ప్రాసెస్‌లో ఉన్నాయి. ఈ దరఖాస్తులపై పూర్తిస్థాయి విచారణ కోసం కలెక్టర్‌కు నివేదిక అందజేస్తామని, లబ్ది పొందిన 36 మంది అర్హతపై విచారణ చేయాలని ప్రభుత్వానికి రాస్తామని ఎస్పీ తెలిపారు. ప్రాసెస్‌లో ఉన్న 18 దరఖాస్తులను వెంటనే నిలిపివేయాలని ఉన్నతాధికారులను కోరతామన్నారు.

Kalyana Lakshmi Forgery | జిరాక్స్​ సెంటర్​ నడుపుతూ..

భిక్కనూర్‌లో జిరాక్స్ సెంటర్ నిర్వహిస్తున్న బోయిని ప్రసాద్ ఈ ఫోర్జరీకి ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సంతకాల ఫోర్జరీ, డాక్యుమెంటేషన్ బాధ్యత ప్రసాద్ చూసేవాడని, లబ్దిదారుల నుంచి డబ్బులు వసూలు చేసే పనిని తొడెంగల రాజా నరేందర్​, రాజలింగం అనే తండ్రీకొడుకులు నిర్వహించేవారని ఎస్పీ చెప్పారు. ఒక్కో దరఖాస్తుకు రూ.4,500 నుంచి రూ.5 వేల వరకు తీసుకుంటున్నట్టుగా ఎస్పీ తెలిపారు. ఈ ఇద్దరు గతంలో కామారెడ్డి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో ఔట్‌సోర్సింగ్‌లో పనిచేసి దరఖాస్తుల ప్రాసెస్‌ను పూర్తిగా అర్థం చేసుకున్నారని సమాచారం ఉందన్నారు. ప్రస్తుతం విధుల్లో ఉన్న ఆర్ఎంఓతో పాటు రిటైర్డ్ ఆర్ఎంఓ, మెడికల్ ఆఫీసర్ల సంతకాలను కూడా నిందితులు ఫోర్జరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

వికలాంగుడిగా సర్టిఫికెట్​ తెచ్చుకుని..

ప్రధాన నిందితుడు బోయిని ప్రసాద్ వికలాంగుడిగా నకిలీ సర్టిఫికెట్ సృష్టించుకుని ఉచిత బస్ పాస్ కూడా పొందాడు. కే న్యూస్, ప్రజా శంఖారావం పత్రికలు, మీడియా పేరుతో అక్రిడిటేషన్ కార్డులు తయారు చేసుకుని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడినట్లు కూడా విచారణలో వెల్లడైందన్నారు. నిందితులను పూర్తిస్థాయి విచారణ కోసం కస్టడీకి కోరతామని, ఇతర మండలాల్లో, ఇతర పథకాల్లోనూ ఇలాంటి మోసాలు జరిగాయా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగిస్తామని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. నిందితుల నుంచి కంప్యూటర్​, మూడు మొబైళ్లు, నకిలీ అధికారిక రబ్బరు స్టాంపులు, స్టాంప్ ప్యాడ్ స్వాధీనం చేసుకున్నామన్నారు.  సమావేశంలో డీఎస్పీ మధుసూదన్, పట్టణ సీఐ నరహరి పాల్గొన్నారు. తోడెంగల రాజా నరేందర్, రాజలింగం గా మార్చండి అన్నా

ఇది కూడా చదవండి: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న యాక్టర్​ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *