అక్షరటుడే, వెబ్డెస్క్: Godavari Flood Alert | తెలంగాణ (Telangana)లో గత రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, జలాశయాలు జలకళను సంతరించుకుంటున్నాయి. గోదావరి, కృష్ణా నదుల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది.
Godavari Flood Alert | జురాల గేట్ల ఎత్తివేత
ఎగువ కర్ణాటక రాష్ట్రంలో భారీ వర్షాలతో ఆల్మట్టి డ్యాం గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు. దీంతో ఇప్పటికే జూరాల ప్రాజెక్టులో వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నిండడంతో గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ వరద శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతోంది.
Godavari Flood Alert | ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి
గోదావరి పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో నదిలో వరద నీరు ఉధృతంగా వచ్చి చేరుతోంది. తాజాగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
భారీ వర్షసూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఉమ్మడి నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఇది కూడా చదవండి..: Peddi Sudarshan Reddy | ముగిసిన తెలంగాణ ఉద్యమ యోధుడి రాజకీయ ప్రస్థానం