అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Oora Pandaga Security | నగరంలో ఆదివారం నిర్వహించనున్న ఊర పండుగకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా నగరంలోని శుక్రవారం దేవతామూర్తులు తయారుచేసే ప్రాంతాలను, రహదారులను ఆయన పరిశీలించారు.
Oora Pandaga Security | కొండెంగ హన్మాండ్ల వద్ద..
మొదటగా సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) ఊర పండుగకు సంబంధించి దేవతామూర్తులు తయారవుతున్న కొండెంగ హన్మాండ్లు ఆలయం వద్ద తనిఖీలు నిర్వహించారు. అనంతరం అక్కడినుంచి గోల్‌హన్మాన్, సిర్నాపల్లి గడి తదితర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఖిల్లా చౌరస్తా నుంచి దేవతామూర్తులు ఊరేగింపు సందర్భంగా ఆద్యంతం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఖిల్లా చౌరస్తా నుంచి లక్ష్మీ మెడికల్, పులాంగ్, మహాలక్ష్మి నగర్ దుబ్బ ప్రాంతాల్లోనూ పోలీసు బందోబస్తు ఉంటుందన్నారు. ప్రజలు సైతం పోలీసులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సర్వ సమాజ్ కమిటీ ప్రతినిధి రామర్తి గంగాధర్, కార్పొరేటర్ మహేందర్, రామడుగు బాలకిషన్, నరేష్, సీఐలు సతీష్, శ్రీనివాస్ రాజ్, వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి, ఎస్సై యాదగిరి, సీసీఎస్ సీఐ, ఎస్బీ, ఇంటెలిజెన్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: SRSP Flood Inflow | శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద: 24 గంటల్లోనే ఐదు టీఎంసీలు చేరిక..