Ration eKYC Deadline | ప్రభుత్వం కీలక నిర్ణయం.. రేషన్‌కార్డు ఈ-కేవైసీ గడువు పొడిగింపు

రేషన్‌కార్డు లబ్ధిదారులు ఈ-కేవైసీ పూర్తి చేసేందుకు ఉన్న గడువును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో నెల రోజులు పొడిగించింది.

Shivam nagarani

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Ration eKYC Deadline | రేషన్‌కార్డు లబ్ధిదారులు ఈ-కేవైసీ పూర్తి చేసేందుకు ఉన్న గడువును తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం మరో నెల రోజులు పొడిగించింది. ఇవాళే ఆఖరి రోజు కావడంతో, ఈ గడువును ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ ప్రకటించింది.

గడువులోగా ఈ-కేవైసీ పూర్తి చేయకుంటే నిత్యావసర సరకులు అందవని అధికారులు స్పష్టం చేస్తుండడంతో కార్డుదారులు కొద్దిగా ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తాజా నిర్ణయం లబ్ధిదారులకు ఎంతో ఊరటనిచ్చింది. అలాగే, ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు మూడు నెలల రేషన్‌ను ఒకేసారి పంపిణీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి..: Formula E Case | ఫార్ములా-ఈ కేసు.. నాంపల్లి కోర్టుకు హాజరైన కేటీఆర్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *