Excise Constable Suspension | వసూళ్లకు పాల్పడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సస్పెన్షన్​

రహదారిపై వెళ్తున్న వాహనాలను నిలిపివేసి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు పడింది.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Excise Constable Suspension | రహదారిపై వెళ్తున్న వాహనాలను నిలిపివేసి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ పై (Constable Suspension) సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు జిల్లా (kamareddy) ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.

Excise Constable Suspension | మద్నూర్​ పరిధిలోని సలాబత్​ పూర్​..

ఈనెల 30న మద్నూర్ (Madnoor) పరిధిలోని సలాబత్ పూర్ (Salabatpur Checkpost) అంతర్రాష్ట్ర చెక్​పోస్టు వద్ద ఎక్సైజ్ కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి విధుల్లో ఉన్నాడు. అయితే ఆయన మరొక ప్రైవేట్ వ్యక్తితో కలిసి వచ్చిపోయే వాహనాలను నిలిపి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. సదరు కానిస్టేబుల్ వసూళ్లకు పాల్పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారడంతో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి స్పందించారు. ఘటనపై విచారణ జరిపి అతన్ని సస్పెండ్ చేయాలని కరీంనగర్ నోడల్ కార్యాలయానికి నివేదిక పంపించారు. శుక్రవారం కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ కరీంనగర్ నోడల్ అధికారి ఉత్తర్వులు జారీ చేసినట్లు ముకుంద రెడ్డి తెలిపారు. సంబంధిత ఉత్తర్వులు కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డికి అందజేసినట్లు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : పెరుగుతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *