Fake Accreditation Card | నకిలీ మీడియా అక్రెడిటేషన్ కార్డుపై పోలీసులకు ఫిర్యాదు

బోగస్ మీడియా అక్రెడిటేషన్ కార్డులను తయారు చేయడం, వినియోగించడం చట్టవిరుద్ధమని పేర్కొన్న ఎన్. పద్మశ్రీ.. అలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Fake Accreditation Card | వాట్సప్‌తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో పి. శ్రీనివాస్ అనే వ్యక్తి పేరుతో నకిలీ మీడియా అక్రెడిటేషన్ కార్డు చెలామణి అవుతున్న నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారిణి ఎన్. పద్మశ్రీ తెలిపారు.

ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో.. సదరు అక్రెడిటేషన్ కార్డు సమాచార పౌర సంబంధాల శాఖ, నిజామాబాద్ జిల్లా కార్యాలయం నుంచి జారీ కాలేదని స్పష్టం చేశారు.

IAS Officer Y. Srilaxmi | శిఖరం నుంచి పతనం.. మళ్లీ బాధ్యతల వైపు : వై. శ్రీలక్ష్మి పరిపాలనా ప్రయాణం

Fake Accreditation Card | కలెక్టర్​ సంతకం ఫోర్జరీ

జిల్లా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ కార్డును తయారు చేసినట్లు గుర్తించిన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

ఇలాంటి నకిలీ, బోగస్ మీడియా అక్రెడిటేషన్ కార్డులను తయారు చేయడం, వినియోగించడం చట్టవిరుద్ధమని పేర్కొన్న ఎన్. పద్మశ్రీ.. అలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు, ప్రభుత్వ శాఖలు అక్రెడిటేషన్ కార్డుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *