అక్షరటుడే, వెబ్డెస్క్: Bhavesh Mishra IAS Collector | తెలంగాణ Telangana పాలనా యంత్రాంగంలో ఒక అరుదైన, ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. భార్య ప్రసూతి సెలవుపై వెళ్తుండగా… ఆమె నిర్వర్తిస్తున్న జిల్లా కలెక్టర్ బాధ్యతలను స్వయంగా ఆమె భర్తే స్వీకరించనున్నారు!
Bhavesh Mishra IAS Collector | ఐఏఎస్ దంపతులు..
ఐఏఎస్ దంపతులైన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, నిర్మల్ జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా ఐఏఎస్ కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఇలా త్రిపాఠి ప్రసూతి సెలవుపై వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఆమెకు 55 రోజుల పాటు (ఆగస్టు 6, 2026 నుంచి సెప్టెంబరు 30, 2026 వరకు) ప్రసూతి సెలవు మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది.
Eluru Ambulance Incident | గుంతలో ఎగిరిపడ్డ అంబులెన్స్..లేచి కూర్చున్న చనిపోయిందనుకున్న మహిళ
అయితే, ఆమె సెలవులో ఉండే ఈ కాలంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ బాధ్యతలను ఎవరు చూసుకోవాలనే దానిపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పక్కనే ఉన్న నిర్మల్ జిల్లా కలెక్టర్, ఇలా త్రిపాఠి భర్త అయిన భావేష్ మిశ్రాకు నిజామాబాద్ కలెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను (Full Additional Charge – FAC) అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు ఉత్తర్వులు విడుదల చేశారు.
Bhavesh Mishra IAS Collector | సెలవులు ముగిశాక తిరిగి బాధ్యతలు..
తన భార్య చూస్తున్న బాధ్యతలను, ఆమె సెలవు సమయంలో భర్తే అదనపు బాధ్యతగా స్వీకరించడం పాలనా వర్గాల్లోనూ, సాధారణ ప్రజల్లోనూ విశేషంగా నిలిచింది. సెలవు కాలం ముగిసిన అనంతరం ఇలా త్రిపాఠి తిరిగి వచ్చి నిజామాబాద్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు.