Dichpally Lorry Accident | జాతీయ రహదారిపై లారీ బోల్తా

జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ఓ భారీ కంటైనర్ లారీ అదుపు తప్పి బోల్తా పడింది.

shashi kiran Mottala

అక్షరటుడే, డిచ్‌పల్లి: Dichpally Lorry Accident | జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ఓ భారీ కంటైనర్ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటన డిచ్‌పల్లి (Dichpally ) మండలం సుద్దపల్లి గ్రామం వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

Dichpally Lorry Accident |  నాగ్​పూర్​ నుంచి స్పేర్​పార్ట్స్​

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగ్​పూర్ నుంచి స్పేర్​పార్ట్స్ సామగ్రి లోడుతో బెంగళూరు (Benguluru) వైపు వెళ్తున్న ఓ భారీ కంటైనర్ లారీ 44వ నంబర్ జాతీయ రహదారిపై సుద్దపల్లి( Suddapalli) గ్రామం వద్దకు రాగానే ఒక్కసారిగా అదుపు తప్పి పక్కనే ఉన్న సర్వీస్ రెయిలింగ్​పై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ సురక్షితంగా స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కంటైనర్ లారీ సర్వీస్ రోడ్డును ఆనుకుని ఉన్న ఇనుప విద్యుత్ స్తంభంపై బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో విద్యుత్ సరఫరా ఉంది. అయితే లారీ స్తంభాన్ని ఢీకొట్టిన వెంటనే విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో భారీ ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *