Amdapur Bonalu Festival | అమ్దాపూర్​లో ఘనంగా బోనాల పండుగ

బోధన్​ మండలంలోని అమ్దాపూర్​లో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బోధన్: Amdapur Bonalu Festival | ఆషాఢమాసంలో ఊరూరా బోనాల (Bonalu) పండుగ సంబురాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మండలంలోని (bodhan) అమ్దాపూర్​లో గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో  బోనాలు నిర్వహించారు.

Amdapur Bonalu Festival | ప్రత్యేక పూజలు

ఆషాడ మాసంలో వచ్చే బోనాల పండుగను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ఆడపడుచులు సాంప్రదాయబద్ధంగా ముస్తాబై అమ్మవారికి బోనాలు సమర్పించారు. గ్రామంలోని ఉజ్జయిని మాత ఆలయానికి పిల్లా పాపలతో బోనం ఎత్తుకొని ఆలయానికి పెద్దఎత్తున బయలుదేరారు. అనంతరం ఆలయంలో అమ్మవారికి బోనాల సమర్పించి వర్షాలు బాగా కురిసి పాడిపంటలతో గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోరెడ్డి గంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు పల్లెన్న పాల్గొన్నారు.

bonalu11

ఇది కూడా చదవండి: అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం స్పోకేన్‌లో అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలు 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *