అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Borabanda Car Accident | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని బోరబండలో ఆదివారం కారు బీభత్సం సృష్టించింది. ఓ బాలుడు అతివేగంగా కారు నడపడంతో.. నియంత్రణ కోల్పోయి పలు బైక్‌లను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యయి.
మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్మికనగర్‌లో 17 ఏళ్ల బాలుడు కారుతో బీభత్సం సృష్టించారు. అతివేగంగా దూసుకొచ్చి బైక్‌పై వెళ్తున్న ఇద్దరు సోదరులను ఢీకొట్టాడు. అంతేగాకుండా అదే వేగంలో మరో 7 బైకులను సైతం ఢీకొట్టడంతో అవి ఎరిగి పడ్డాయి. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డు అయింది.
Borabanda Car Accident | అద్దె కారుతో..
ప్రమాదంలో ఇద్దరు సోదరులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని రాజ్‌కుమార్ (60), ప్రభాకర్ (55)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆ బాలుడు అద్దె కారును తీసుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
A 17-year-old #minor allegedly lost control of a #rentedcar in #KarmikaNagar on Sunday, injuring two brothers on their way to #church and damaging seven parked #motorcycles.#MadhurNagar Police have registered a #case and are investigating.@hydcitypolice pic.twitter.com/UXCfh2yFtZ
— NewsMeter (@NewsMeter_In) August 2, 2026
దీనిని కూడా చదవండి : KTR Rahul Letter | ఇంజినీరింగ్ విద్యార్థులపై సీఎం రేవంత్ వ్యాఖ్యల దుమారం.. రాహుల్ గాంధీకి కేటీఆర్ ఘాటు లేఖ