Tractor Accident | సదాశివనగర్​లో ఘోరం.. ట్రాక్టర్ ఢీకొని బాలుడు మృతి

ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని ట్రాక్టర్ ఢీకొట్టడంతో మృతి చెందాడు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి : Tractor Accident | ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని ట్రాక్టర్ ఢీకొట్టడంతో మృతి చెందాడు. సదాశివనగర్ (Sadashivanagar) మండలం యాచారం గ్రామంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

Tractor Accident | బంధువుల ఇంటికి వెళ్లి..

స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందల్వాయి(Indalwai) మండలం చంద్రాయన్ పల్లి గ్రామానికి చెందిన సంగేమ్ అజిత్ కుమారుడు లక్ష్మణ్ (9) స్థానిక పాఠశాలలో నాల్గో తరగతి చదువుతున్నాడు. కాగా సదాశివనగర్ మండలంలోని యాచారం గ్రామంలో బంధువుల ఇంటి వద్ద దశదిన ఖర్మ కార్యక్రమానికి వచ్చారు. గ్రామంలో బాలుడు బయట ఆడుకుంటుండగా ఓ ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలుడిని తక్షణమే చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రికి చేరుకునే సరికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇది కూడా చదవండి: మూడేళ్లలోపే 1,000 రోబోటిక్ శస్త్రచికిత్సలు పూర్తి చేసిన NIMS.. 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *