అక్షరటుడే, ఎల్లారెడ్డి: Pocharam Project | వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు నాగిరెడ్డిపేట (Nagireddypeta)లోని పోచారం ప్రాజెక్ట్ పొంగిపొర్లుతుంది. ప్రాజెక్టు నిండడంతో పరిసర ప్రాంతాల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Pocharam Project | పూర్తిస్థాయికి చేరుకున్న నీటిమట్టం
ప్రాజెక్ట్‌లో ఇన్‌ఫ్లో 2,200 నుంచి 5,207 క్యూసెక్కులకు పెరిగింది. సోమవారం ఉదయం 11గంటలకు ప్రాజెక్ట్ నీటి మట్టం 1464.00 అడుగులు (1.820 టీఎంసీలు) కాగా అదేస్థాయిలో నీటిమట్టం ఉంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ఇన్‌ఫ్లో 5,207 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం కాలువలకు నీటి విడుదల చేయట్లేదు. మిగులు నీరు ప్రాజెక్ట్‌పై నుంచి పొంగి మంజీరలోకి వెళ్తోంది. లింగంపేట పెద్దవాగు, గుండారం వాగుల ద్వారా భారీగా వదర వస్తోంది.
Pocharam Project | అప్రమత్తత అవసరం
ప్రాజెక్ట్ నీటిమట్టం పూర్తిస్థాయికి చేరడంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. నదులు, వాగులు, కాలువల వద్దకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ప్రాజెక్ట్ నిండడంతో ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రాబోయే ఖరీఫ్, వానాకాలం పంటలకు సాగునీటి కొరత ఉండదని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలు కూడా గణనీయంగా పెరిగే అవకాశముందని రైతులు చెబుతున్నారు.
పొంగిపొర్లుతున్న పోచారం ప్రాజెక్టు
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పోచారం పొంగిపొర్లుతోంది. ప్రాజెక్టు 5,207 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయికి చేరడంతో ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రాజెక్టు నిండడంతో పరిసర ప్రాంతాల రైతులు ఆనందం వ్యక్తం… pic.twitter.com/mYAfFavrAo
— Akshara Today | Telugu News (@aksharatoday) August 4, 2026
ఇది కూడా చదవండి..: SRSP Water Level | కొనసాగుతున్న వరద.. ఎస్సారెస్పీలో పెరుగుతున్న నీటిమట్టం