అక్షరటుడే, ఇందూరు: Bonalu Festival | బోనాలు సమాజంలో ఐక్యత, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్ అన్నారు. టీఎన్జీవోస్ నిజామాబాద్ ఆధ్వర్యంలో నగరంలోని పాత కలెక్టరేట్ వద్ద నవదుర్గా ఆలయంలో బోనాల ఉత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై బోనమెత్తారు.
Bonalu Festival | ఆలయంలో ప్రత్యేక పూజలు..
ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని ప్రార్థించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో కలిసి ఆయన బోనాల ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం ఉత్సవ నిర్వాహకులు మహేష్ కుమార్ గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ (MLA Dhanpal), మేయర్ ఉమారాణి, మాజీ మేయర్ సంజయ్ తదితరులను ఘనంగా సన్మానించారు.

కార్యక్రమంలో కార్పొరేషన్ ఛైర్మన్లు కేశ వేణు, శేఖర్ గౌడ్, రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, రామకృష్ణ, దయాకర్ గౌడ్, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, టీఎన్జీవోస్ నిజామాబాద్ అధ్యక్షుడు సుమన్‌కుమార్, కార్యదర్శియ నేతికుంట శేఖర్, ప్రతినిధులు పెద్దోళ్ల గంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఎన్జీవోస్ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Lokayukta Inquiry | బోధన్ శ్మశానవాటిక నిధుల రగడపై ‘లోకాయుక్త’ విచారణ