అక్షరటుడే, వెబ్డెస్క్ : Mohan Bhagwat Gen Z | ఆర్ఎస్ఎస్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిరసనలు తెలపడంతో ‘జెన్-జెడ్’ (Gen Z) యువత దేశ వ్యతిరేకులు కారన్నారు. గురువారం ప్రపంచంలోనే అతిపెద్ద యువజన సదస్సులో ఆయన పాల్గొన్నారు.
జెన్ జెడ్ యువత మన వాళ్లు అని, వారు నిరసనలు చేస్తుంటే ఆందోళనలను పరిష్కరించాలని మోహన్ భగవత్ అన్నారు. జెన్ జెడ్ ఆందోళన చేస్తుంటే, వారు ఖచ్చితంగా దేశద్రోహులు కారని పేర్కొన్నారు. వారు మన తర్వాతి తరం అన్నారు. ప్రపంచాన్ని ఏకం చేయడంలో యువత పాత్ర, భారతీయ పద్ధతిలో అనే సదస్సులో ఆయన ప్రసంగించారు.
Mohan Bhagwat Gen Z | కొన్ని పద్ధతులు ఉంటాయి
జెన్ జెడ్ నిరసనలు చేయకూడదని తాను చెప్పనని ఆర్ఎస్ఎస్ చీఫ్ పేర్కొన్నారు. కానీ ప్రజాస్వామ్యంలో దానికి కొన్ని పద్ధతులు ఉంటాయని స్పష్టం చేశారు. ఢిల్లీ (Delhi)లోని జంతర్ మంతర్ వద్ద ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జెన్ జీ యువత పెద్ద ఎత్తున నిరసన తెలిపిన విషయం తెలిసిందే. నిరసనకారులు యాంటీ నేషనల్స్ అని, వారికి విదేశాల నుంచి నిధులు అందుతున్నాయని పలువురు ఆరోపించారు. ఈ క్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. జెన్-జెడ్ (Mohan Bhagwat Gen Z |) గట్టిగా గళమెత్తుతున్నప్పుడు, అది కేవలం నిరసన కోసం కాదని మనం గుర్తించాలన్నారు. వారికి ఏదో సమస్య ఉందని, దాన్ని పరిష్కరించాలని వారు అలా చేస్తున్నారని తెలిపారు.
#Breaking – RSS chief Mohan Bhagwat’s major statement on the Gen-Z movement
“We need to see that if Gen-Z is shouting, it’s not out of protest; it’s because they have a problem…that should be fixed…if something that shouldn’t happen happens, then there’s a mistake somewhere,… pic.twitter.com/IdbT9ph9px
— NEWS WALA (@NEWSWALApy) August 6, 2026
ఇది కూడా చదవండి : MLA Prakash Goud | కొడుకుపై దాడి చేయించిన ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్!