PDS Rice Seized | నిజామాబాద్‌లో భారీగా పీడీఎస్ బియ్యం పట్టివేత.. పలువురిపై కేసు నమోదు!

రెండు ఘటనల్లో స్వాధీనం చేసుకున్న మొత్తం 51 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేసిన పోలీసులు, నిందితులపై సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: PDS Rice Seized | నిజామాబాద్ ఫిఫ్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం పోలీసులు తనిఖీల్లో భారీగా పీడీఎస్​ బియ్యం పట్టుబడ్డాయి.

రెండు కేసుల్లో మొత్తం 51 క్వింటాళ్ల ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలకు సంబంధించి పలువురిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఐదో ఠాణా ఎస్‌ఐ డి. సునీల్ తెలిపారు.

PDS Rice Seized | అక్రమంగా నిల్వ ఉంచిన…

పోలీసుల వివరాల ప్రకారం, మొదటి ఘటనలో అస్మి కాలనీ, నాగారం ప్రాంతంలో అక్రమంగా నిల్వ ఉంచిన 19.50 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో షేక్ సోహైల్, నోమన్, సిద్ధిక్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Nizamabad Chain Snatching | చైన్ స్నాచింగ్ కేసు ఛేదించిన పోలీసులు..నిందితుల అరెస్టు

PDS Rice Seized | అక్రమంగా తరలిస్తుండగా..

మరో ఘటనలో నాగారం ప్రాంతంలోని 80 క్వార్టర్స్ వద్ద 31.50 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని ఓ వాహనంలో అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు అడ్డుకుని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అబ్దుల్ అర్బాజ్, అబూ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

ఈ రెండు ఘటనల్లో స్వాధీనం చేసుకున్న మొత్తం 51 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేసిన పోలీసులు, నిందితులపై సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద పంపిణీ చేసే బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం, తరలించడం వంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *