అక్షరటుడే, బాన్సువాడ: Pocharam Bus | బీర్కూర్ పరిసర గ్రామాల విద్యార్థుల ప్రయాణ ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) వెంటనే స్పందించారు. ప్రత్యేక బస్సు సర్వీసు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.
Pocharam Bus | వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తూ..
బాన్సువాడ నుంచి తిమ్మాపూర్ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించేందుకు శుక్రవారం వెళ్తున్న సందర్భంగా కిష్టాపూర్ గ్రామ బస్టాండ్ వద్ద సుమారు 20 మంది విద్యార్థులు బస్సు కోసం వేచి ఉండడాన్ని ఆయన గమనించారు. వెంటనే వాహనాన్ని ఆపి విద్యార్థులతో మాట్లాడగా.. సమయానికి బస్సులు అందుబాటులో లేక ముందుగా బాన్సువాడకు వెళ్లి అక్కడి నుంచి మరో బస్సులో ఎస్‌ఆర్‌ఎన్‌కే డిగ్రీ కళాశాలకు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. దీంతో ప్రతిరోజూ ఆలస్యంగా కళాశాలకు చేరుకుంటున్నామని వారు వివరించారు.
విద్యార్థుల సమస్యను తెలుసుకున్న పోచారం శ్రీనివాసరెడ్డి వెంటనే బాన్సువాడ డిపో మేనేజర్ రవికుమార్‌తో ఫోన్‌లో మాట్లాడి, బాన్సువాడ–బీర్కూర్–కిష్టాపూర్–తిమ్మాపూర్–బొమ్మందేవ్‌పల్లి చౌరస్తా మీదుగా ఎస్‌ఆర్‌ఎన్‌కే డిగ్రీ కళాశాల వరకు ఉదయం ప్రత్యేక బస్సు సర్వీసును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే విద్యార్థినుల భద్రత, విద్యార్థులు సమయానికి కళాశాలకు చేరుకునే అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఉదయం, సాయంత్రం ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. తమ సమస్యను గుర్తించి తక్షణమే పరిష్కారం చూపిన పోచారం శ్రీనివాసరెడ్డికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇది కూడా చదవండి..: SRSP Storage | ఎస్సారెస్పీలో 38.41 టీఎంసీలకు చేరిన నీటినిల్వ