అక్షరటుడే, వెబ్‌డెస్క్: Husnabad Development Works | తెలంగాణ ప్రభుత్వం హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు శుభవార్త అందించింది. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, వంతెనలు, క్రాస్ డ్రైనేజ్ పనుల అభివృద్ధి కోసం మొత్తం రూ. 33.70 కోట్లతో 28 అభివృద్ధి పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ గురువారం (ఆగస్టు 6న) జి.ఓ.ఆర్.టి. నెం.425ను జారీ చేసింది.
Husnabad Development Works | ఈ మండలాలకు రూ. 7.70 కోట్లు
హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లోని పలు అభివృద్ధి పనులకు రూ. 7.70 కోట్లు కేటాయించారు. భీమదేవరపల్లి మండలంలో నాలుగు అభివృద్ధి పనులకు రూ.6.20 కోట్లు కేటాయించారు. ఇందులో భాగంగా కొప్పూర్–జగన్నాథపూర్ మధ్య కాజ్‌వే నిర్మాణానికి రూ.60 లక్షలు, రాసూల్‌పల్లి–బంగ్లాపల్లి మధ్య హై లెవెల్ బ్రిడ్జికి రూ.1.60 కోట్లు, రాసూల్‌పల్లి–బొల్లొనిపల్లి మధ్య హై లెవెల్ బ్రిడ్జికి రూ.1.60 కోట్లు, అలాగే రాసూల్‌పల్లి–వీర్లగడ్డ తండా మధ్య లో లెవెల్ కాజ్‌వే నిర్మాణానికి రూ.2.40 కోట్లు మంజూరయ్యాయి. మరోవైపు, ఎల్కతుర్తి మండలంలో ఇందిరానగర్–గోపాల్‌పూర్ మధ్య హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.1.50 కోట్లు కేటాయించారు.
Husnabad Development Works | రవాణా సమస్యలు..
ఈ అభివృద్ధి పనులు పూర్తయితే గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు, ముఖ్యంగా వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొనే రాకపోకల ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. గ్రామీణ మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, మంజూరైన పనులను త్వరితగతిన ప్రారంభించి నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Husnabad Development Works | మంత్రులు, స్థానిక నేతల కృతజ్ఞతలు
హుస్నాబాద్ నియోజకవర్గంలో రోడ్లు, వంతెనల అభివృద్ధి కోసం భారీగా నిధులు మంజూరు చేయడంపై రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంబంధిత శాఖల మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. అలాగే ఎల్కతుర్తి, భీమదేవరపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్, రాజిరెడ్డి తదితరులు కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
హుస్నాబాద్‌కు రూ.33.70 కోట్ల నిధులు మంజూరు
హుస్నాబాద్ నియోజకవర్గంలో గ్రామీణ రహదారులు, వంతెనలు, క్రాస్ డ్రైనేజ్ పనుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రూ.33.70 కోట్ల నిధులు మంజూరు చేసింది. మొత్తం 28 పనులకు పరిపాలనా అనుమతులు ఇస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ… pic.twitter.com/F5Efp1WJq4
— Telangana365 (@Telangana365) August 7, 2026
ఇది కూడా చదవండి: OBC National Conference | ఓబీసీ 11వ జాతీయ మహాసభల్లో నిజామాబాద్ బీసీ శ్రేణులు