Nizamabad Road Development | అర్బన్​లో అభివృద్ధి పనులపై కేంద్ర మంత్రికి ధన్​పాల్​ వినతి

నగరంలోని పలు రోడ్లు, వంతెనల అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ తెలిపారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Nizamabad Road Development | నగరంలోని పలు రోడ్లు, వంతెనల అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ తెలిపారు. ఎంపీ అర్వింద్​ (MP Arvind)తో కలిసి శుక్రవారం కేంద్ర రోడ్డు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ప్రతిపాదనలను అందజేశారు.

Nizamabad Road Development | నగరంలోని దేవిరోడ్డు, రైల్వేస్టేషన్​..

Nizamabad Road Development

ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నగరంలోని దేవీ రోడ్డు, రైల్వే స్టేషన్, నాందేవ్​వాడ అదనపు వంతెన ( ఆర్​వోబీ) మంజూరుచేయాలని కోరామన్నారు. అలాగే సోనీ ఫంక్షన్ హాల్ సమీపంలో ఎల్లమ్మ గుట్ట వద్ద ఆర్​యూబీఏర్పాటు చేయడం అత్యంత ఆవశ్యకమన్నారు. ఇందుకోసం రెండింటికి రూ.170 కోట్లు మంజూరు చేయాలని కోరారు. అలాగే నిజామాబాద్​లోని రేడియో స్టేషన్ నుంచి ముదక్​పల్లి పాత జీపీ ఆఫీస్ వరకు రూ.30కోట్లతో ఆర్​అండ్​బీ రోడ్డు కోసం ప్రతిపాదించడం జరిగిందన్నారు. వర్ని జంక్షన్ నుంచి నిజామాబాద్, డిచ్​పల్లి, ఇందల్వాయి, భీమ్​గల్​ మీదుగా కమ్మర్​పల్లి వరకు నగరాన్ని కలుపుతూ 107 కిలోమీటర్ల పొడవుతో కొత్త జాతీయ రహదారి ప్రతిపాదనను కూడా అందజేశామన్నారు. మరొక రోడ్డు నగరంలోని రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి ఎన్టీఆర్ విగ్రహం, దుబ్బ మీదుగా కాలూర్ రోడ్డు ను పూర్తి చేయాలని కోరినట్లు తెలిపారు.  ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి అభయ్ పాటిల్, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఉన్నారు.

ఇది కూడా చదవండి..: Pocharam Project Water | పోచారం ప్రాజెక్టు నుంచి నీటివిడుదల

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *