BRS Formation Day | పల్లె నుంచి పట్నం వరకు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించాలి: కేటీఆర్​

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​: BRS Formation Day | బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం, పట్టణం, నియోజకవర్గం, జిల్లా కేంద్రాల్లో పార్టీ జెండాలను ఎగురవేయాలని సూచించారు. ఇందులో భాగంగా పార్టీ శ్రేణులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ భవన్‌లో ఏప్రిల్ 27నరాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశం జరుగుతుందని కేటీఆర్ తెలిపారు.

BRS Formation Day | ఎండ తీవ్రత దృష్ట్యా..

జగిత్యాలలో ఇటీవల భారీ బహిరంగ సభ నిర్వహించడం, ప్రస్తుతం ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో కేసీఆర్ ఆదేశాల మేరకు ఈసారి ప్లీనరీని కేవలం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికే పరిమితం చేసినట్లు కేటీఆర్ తెలిపారు. సమావేశానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లకు మాత్రమే ఆహ్వానం ఉందని పేర్కొన్నారు.

తెలంగాణ భవన్‌లో పరిమిత సంఖ్యలోనే ప్రవేశం ఉంటుందని కేటీఆర్​ తెలిపారు. ఆహ్వానం ఉన్న వారు మాత్రమే హాజరుకావాలని, మిగిలిన నాయకులు, కార్యకర్తలు తమ నియోజకవర్గాల్లోనే ఉండి వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేటీఆర్ కోరారు.

BRS Formation Day | పార్టీ జెండా ఎగురవేయాలి

పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామం, మండలం, పట్టణం, జిల్లా కేంద్రాల్లో బీఆర్​ఎస్​ జెండాను ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఉదయాన్నే స్థానిక ప్రాంతాల్లో జెండా పండుగ ముగించుకోవాలన్నారు. మధ్యాహ్నం 1:30 గంటల కల్లా హైదరాబాద్ చేరుకోవాలని దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రతినిధులకు ఆయన సూచించారు.

BRS Formation Day

ఇది కూడా చదవండి..: Free Sewing Machines | మహిళలకు గుడ్​న్యూస్​.. ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *