నిజామాబాద్Kanyaka Parameswari Jayanti | ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు

Kanyaka Parameswari Jayanti | ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు

వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలను ఎల్లారెడ్డి ఆదివారం ఘనంగా నిర్వహించారు. వైశాఖ శుక్లపక్ష దశమిని పురస్కరించుకొని వాసవి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Kanyaka Parameswari Jayanti | వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలను ఎల్లారెడ్డి ఆదివారం ఘనంగా నిర్వహించారు. వైశాఖ శుక్లపక్ష దశమిని పురస్కరించుకొని వాసవి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

Kanyaka Parameswari Jayanti | పోచమ్మ గుడి వరకు ఊరేగింపు

వైశ్యులు స్థానిక దొరవారి హనుమాన్ మందిరం నుంచి కలశం హారతితో పోచమ్మ గుడి వరకు ఊరేగింపుగా వెళ్లారు. ఆలయంలోని అమ్మవారికి అభిషేకం చేసి వాసవి మాత ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో కుంకుమార్చనలు, ఓడి బియ్యం, అమ్మవారి చరిత్ర సామూహిక పారాయణం నిర్వహించారు. మధ్యాహ్నం ప్రత్యేక పూజలు చేసి అన్నదానం చేశారు. సాయంత్రం మంగళహారతులు దాండియా అంతాక్షరి పిల్లల సాంస్కృతిక నృత్యాలు, షోడశోపచార పూజలో నృత్యం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి ప్రత్యేక హారతులు పవళింపు సేవతో పాటు అల్పాహారం వితరణ చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు కంచర్ల బాలకిషన్ గుప్తా, వందలాది వైశ్యులు పాల్గొన్నారు.

Kanyaka Parameswari Jayanti

Kanyaka Parameswari Jayanti | సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

వైశ్యుల ఆరాధ్య దేవత వాసవి కన్యకా పరమేశ్వరి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఆర్యవైశ్య సంఘం నాయకులు పాలాభిషేకం చేశారు. జయంతి వేడుకలను పురస్కరించుకొని వాసవి మాత ఆలయంలో మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సిద్ది శ్రీధర్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి మాత జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగ ప్రకటించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, స్థానిక శాసనసభ్యులు మదన్మోహన్​ రావు, ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్​పర్సన్​ కల్వ సుజాతకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వారి చిత్రపటాలకు సిద్ది శ్రీధర్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైశ్యుల కలను రాష్ట్ర ప్రభుత్వం నిజం చేసిందని కొనియాడారు. ఆర్యవైశ్యులంతా ఐక్యంగా ఉంటే ఏదైనా సాధ్యమని పేర్కొన్నారు.

Kanyaka Parameswari Jayanti

ఇది కూడా చదవండి..: Vasavi Matha Jayanti | కలెక్టరేట్​లో ఘనంగా వాసవీ మాత కన్యకా పరమేశ్వరి జయంతి

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....

Modi UAE Visit | ప్రధాని మోడీ విదేశీ పర్యటన.. యూఏఈలో కీలక భేటీ!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Modi UAE Visit | ఐరోపా దేశాల్లో వచ్చే నెల...

IFS Officers Transfers | ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారుల బదిలీ

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IFS Officers Transfers | ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS)...