Panchajanya Sabha | 26న నిజామాబాద్​లో టీఆర్​ఎస్​ పాంచజన్య సభ

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిజామాబాద్​లో సభ నిర్వహించనున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Panchajanya Sabha | తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) నిజామాబాద్​లో సభ నిర్వహించనున్నారు. ఆగస్టు 26న పాంచజన్య సంకల్ప సభ నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు.

నిజామాబాద్ (Nizamabad) జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ గ్రౌండ్ లో ఆగస్టు 26న మధ్యాహ్నం 3 గంటలకు సభ ఉంటుంది. ఈ కార్యక్రమానికి కల్వకుంట్ల కవిత హాజరై మాట్లాడారు. సభ పర్యవేక్షకులుగా టీఆర్ఎస్ కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జీ డాక్టర్ రఘును కవిత నియమించారు. కాగా కొత్త పార్టీ పెట్టిన అనంతరం కవిత జిల్లాలో మొదటి సభ పెడుతుండటం గమనార్హం.

Panchajanya Sabha | పార్టీ బలోపేతం కోసం..

ఇటీవల కొత్త పార్టీ పెట్టిన కవిత దాని బలోపేతంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఇప్పటికే సింగరేణిలో రెండు విడతలుగా బాయిబాట పేరిట పర్యటించారు. పలు జిల్లాల్లో పర్యటించి ప్రజా సమస్యలపై ఆందోళనలు చేశారు. తొలిసారి నిజామాబాద్​లో సభ పెట్టేందుకు సిద్ధం అయ్యారు. ఆమె గతంలో నిజామాబాద్​ ఎంపీగా పని చేసిన విషయం తెలిసిందే. దీంతో పాంచజన్య సంకల్ప సభను విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు కృషి చేస్తున్నారు.

దీనిని కూడా చదవండి : Jharkhand Student Protest | జార్ఖండ్​లో విద్యార్థులపై లాఠీఛార్జ్​ తప్పు : రాహుల్​ గాంధీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *