RTC Mechanic Death | బస్సు రిపేర్​ చేస్తుండగా ప్రమాదం.. ఆర్టీసీ మెకానిక్​ మృతి

హైదరాబాద్​ నగరంలోని జీడిమెట్లలో బస్సు రిపేర్​ చేస్తుండగా.. ​ప్రమాదవశాత్తు మెకానిక్​ మృతి చెందాడు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : RTC Mechanic Death | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలోని జీడిమెట్లలో విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ డిపోలో బస్సు రిపేర్​ చేస్తుండగా.. ​ప్రమాదవశాత్తు మెకానిక్​ మృతి చెందాడు.

RTC Mechanic Death | బ్రేక్​ సమస్య రావడంతో..

జీడిమెట్ల డిపోలో బస్సు బ్రేకులను బాగుచేస్తుండగా, బస్సు ఒక్కసారిగా ముందుకు కదలడంతో 39 ఏళ్ల మెకానిక్ సంతోష్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. బస్సు బ్రేక్‌ సమస్య రావడంతో మెకానిక్‌ సంతోష్‌ కుమార్‌ మరమ్మతులు చేస్తున్నారు. ఆయన బస్సు కింద నుంచి బయటకు రాకముందే డ్రైవర్‌ బస్సును ముందుకు తీసుకెళ్లాడు. దీంతో అది మెకానిక్​ పై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Lal Darwaza Bonalu | లాల్​దర్వాజ బోనాలు.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *