అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KTR Comments Revanth | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)ని ఎవరు దేకడం లేదని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన హుజుర్నగర్లో పర్యటించారు. హుజూర్‌నగర్ నియోజకవర్గ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడు పిల్లుట్ల రఘుతో పాటు పలువురు బీఆర్ఎస్లో చేరారు.
కేటీఆర్ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో యాంకర్ మాట్లాడుతూ.. శ్రీధర్‌బాబును ముఖ్యమంత్రి అన్నారని ఎద్దేవాచేశారు. రేవంత్‌రెడ్డిని ఎవరు గుర్తు పట్టడం లేదని విమర్శించారు. BRS హయాంలో తెచ్చిన కంపెనీలకు.. ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎంగా రేవంత్ పేరుగుర్తు పెట్టుకునే పరిస్థితి లేదన్నారు.
KTR Comments Revanth | బీఆర్ఎస్ బలం పెరిగింది
పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలం పెరిగిందని కేటీఆర్ అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంట్లో మొదలైన బీఆర్ఎస్ ప్రయాణం 25 ఏళ్లు పూర్తి చేసుకుందన్నారు. ‘‘మూడు ఫీట్లు ఉన్నోడు కూడా కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నాడు”అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిన్న తప్పిదాలతో నల్గొండ (Nalgonda) జిల్లాలో 11 సీట్లు కోల్పోయామని ఆయన అంగీకరించారు.

KTR Comments Revanth | హామీలు విస్మరించారు
తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు హామీలు ఇచ్చారని.. వెయ్యి రోజులైనా ఏమీ చేయలేదన్నారు. నల్గొండకు కాంగ్రెస్ చేసిందేమీ లేదని విమర్శించారు. కనీసం నీళ్లు ఇవ్వలేకపోయిందన్నారు. కేసీఆర్ పాలనలో నల్గొండలోని చివరి మడివరకు నీళ్లు పారేలా కృషి చేశారని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో 70 లక్షల మంది రైతులకు కరోనా లాంటి క్లిష్ట సమయాల్లో కూడా రైతుబంధు అందించారన్నారు. రేవంత్ ఎన్నికల ముందు దాన వీర శూర కర్ణ అని.. ఎన్నికలు అయ్యాక కుంభ కర్ణుడని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు.
బ్యాగులు మోసే బ్రోకర్
ఈ రేవంత్!నాడు బ్యాగులో 50 లక్షలు మోసే వాడు..
నేడు వేల కోట్లు ఢిల్లీకి మోసుకెళ్తున్నాడు.– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS pic.twitter.com/EQ5bQFIp4T
— BRS Party (@BRSparty) April 26, 2026
ఇది కూడా చదవండి : Teacher Transfers | విద్యాశాఖలో బదిలీలకు గ్రీన్ సిగ్నల్

