అక్షరటుడే, కామారెడ్డి: Excise Employee | ఎక్సైజ్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కామారెడ్డి (Kamareddy) పట్టణంలోని ఈ ఘటన చోటు చేసుకుంది.
Excise Employee | కల్కినగర్‌లో..
పట్టణంలోని కల్కినగర్‌లో నివాసం ఉంటున్న మామిడి అనిల్ కుమార్(41) ఎక్సైజ్ శాఖలో (Excise Department) జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఆయన తన ఇంట్లో శుక్రవారం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే అతడిని 108 అంబులెన్సులో జీజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. అనిల్ కుమార్ మృతిపై ఆయన తల్లి ఇందిర అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనిల్ కుమార్‌కు భార్య నీరజ, పిల్లలు శాన్వి, జాహ్నవి, రిషిత్ ఉన్నారు. తల్లి ఇందిర ఫిర్యాదు మేరకు దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో మార్చురికి తరలించారు. కాగా అనిల్ దోమకొండ ఎక్సైజ్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసేవాడు.
ఇది కూడా చదవండి: Telangana Weather | పలు జిల్లాలకు నేడు వర్ష సూచన