అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Collectorate | స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కామారెడ్డి (Kamareddy) జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం త్రివర్ణ కాంతులతో కళకళలాడుతోంది. పై అంతస్తులు కాషాయం, మధ్యలో తెల్లని వెలుగులు, కింది భాగం పచ్చని దీపాలతో అలంకరించడంతో జాతీయ పతాకాన్ని తలపించే దృశ్యం ఆవిష్కృతమైంది.
Kamareddy Collectorate | రాత్రివేళ కలెక్టరేట్..
రాత్రి వేళ కలెక్టరేట్ ఆవరణలోని పచ్చని చెట్లు, పూల మొక్కలు, విద్యుత్ దీపాల వెలుగులో మెరిసిపోతూ దేశభక్తి వాతావరణాన్ని నింపుతున్నాయి. ఆగస్టు 15 పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా అధికారులు ఈ ప్రత్యేక అలంకరణలు చేపట్టారు. కలెక్టరేట్ ను వీక్షించేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. త్రివర్ణ కాంతుల్లో వెలిగిపోతున్న కలెక్టరేట్ ను చూసిన ప్రజలు దేశభక్తిని చాటుతూ సెల్ఫీలు దిగుతున్నారు. జిల్లా అధికార యంత్రాంగం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఇది కూడా చదవండి: Samay Raina | స్టాండప్ కమెడియన్ సమయ్ రైనాకు ఊరట