Bandi Sanjay KTR | పదేళ్లు ఏం చేశారు.. కేటీఆర్​కు బండి సంజయ్​ కౌంటర్​

బీఆర్​ఎస్ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​కు కేంద్ర మంత్రి బండి సంజయ్​ కౌంటర్​ ఇచ్చారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandi Sanjay KTR | బీఆర్​ఎస్ (BRS) వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​కు కేంద్ర మంత్రి బండి సంజయ్​ కౌంటర్​ ఇచ్చారు. పదేళ్లు తెలంగాణను పాలించి, అధికారం కోల్పోయిన తర్వాత భారతదేశంలో మంచి కళాశాలలు లేవు అంటున్నారని విమర్శించారు.

కేటీఆర్​ శనివారం తెలంగాణ భవన్​లో మట్లాడుతూ.. దేశంలో మంచి కాలేజీలు లేవన్నారు. దీంతో తన కూతురు అమెరికాలో చదువుకోడానికి వెళ్తోందని చెప్పారు. అనేక మంది విద్యార్థులు విదేశాల బాట పడుతున్నారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్​ కౌంటర్​ ఇచ్చారు. పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో బీఆర్​ఎస్​ ఏం చేసిందని ప్రశ్నించారు. మంచి పాఠశాలలు, కళాశాలలు ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులను ఆత్మహత్యలకు ఎవరు పురికొల్పారని, తగినంత మంది ఉపాధ్యాయులను ఎందుకు నియమించలేదన్నారు.

Bandi Sanjay KTR | నిధులు ఇవ్వలేదు

బీఆర్​ఎస్​ హయాంలో కళాశాలలకు నిధులు ఇవ్వకుండా చేశారన్నారు. కనీసం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను కూడా సకాలంలో చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్. పాలన రిపోర్ట్ కార్డ్ ఇప్పుడు కేసీఆర్​ (KCR) సొంత ఇంటి నుంచే వస్తోందన్నారు. మొదట ఆయన మనవడు పాఠశాలలు బాగోలేవని అన్నారని, ఇప్పుడు ఆయన మనవరాలు కళాశాలలు అంత మంచిగా లేవని అంటోందన్నారు. ‘‘పదేళ్లు అధికారంలో ఉండి, మీరు సరిచేయడంలో విఫలమైన వాటిని మీ సొంత పిల్లలే ఎత్తి చూపుతున్నారు” అని విమర్శించారు. రాజకీయ ప్రత్యర్థుల పిల్లలు కాలేజీల్లో ఏం చేస్తున్నారోనని అతిగా ఆలోచించడం, తమ ఫోన్లను ట్యాప్ చేయడం మానేసి, వారి సొంత పిల్లల మాట వినాల్సిందని హితవు పలికారు.

ఇది కూడా చదవండి : Weather Update | నేడు పలు ప్రాంతాలకు వర్ష సూచన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *