అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ashish Banerjee Suicide | పశ్చిమ బెంగాల్ మాజీ డిప్యూటీ స్పీకర్, ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన టీఎంసీ (TMC) నేత ఆశిష్ బెనర్జీ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం ఆయన బీర్భూమ్‌లోని తన ఇంటి పక్కనే ఉన్న పార్టీ కార్యాలయంలో విగత జీవిగా కనిపించారు.
పార్టీ ఆఫీసులో ఎమ్మెల్యే చేతిరాతతో ఉన్నట్లుగా భావిస్తున్న సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో తన మరణానికి ఎవరూ బాధ్యులు కారని, రాజకీయాల్లోకి రావడం పొరపాటు అని భావిస్తున్నట్లు బెనర్జీ పేర్కొన్నట్లు సమాచారం. భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావద్దని ఆయన తన కుటుంబ సభ్యులకు సూచించారు. రాంపూర్‌హట్ స్థానంలో వరుసగా ఐదు సార్లు ఆయన గెలిచారు. 2001 నుంచి 2026 వరకు ఆయన ఎమ్మెల్యేగా పని చేశారు. 2026 ఎన్నికల్లో బీజేపీ (BJP) అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.
Ashish Banerjee Suicide | అవినీతికి పాల్పడలేదు
తాను ఎప్పుడూ అవినీతికి పాల్పడలేదని ఆయన సూసైడ్ నోట్లో రాసినట్లు సమాచారం. పార్టీలో జరిగే తప్పులను తాను ఎప్పుడూ అంగీకరించలేకపోయినప్పటికీ, వాటిని ఎదిరించలేకపోయానని ఆయన పేర్కొన్నారు. తారాపీఠ్-రాంపూర్‌హట్ డెవలప్‌మెంట్ అథారిటీ టెండర్ సంబంధిత నిర్ణయాలు, చెక్కుల జారీ, ప్రణాళికల ఆమోదం, ‘నో అబ్జెక్షన్’ సర్టిఫికెట్ల జారీలో తనకు ఎలాంటి పాత్ర లేదని తెలిపారు. ఈ విషయంలో తనను అప్రతిష్ఠపాలు చేయడానికి జరిగిన ప్రయత్నాలను ఆయన ఖండించారు. రాజకీయాల్లోకి రావడం తప్పని ఇప్పుడు అనిపిస్తోందన్నారు. తన కుటుంబంలోని యువకులు రాజకీయాల్లోకి రావద్దని సలహా ఇచ్చారు.
Ashish Banerjee Suicide | మమత బెనర్జీ సన్నిహితుడు
ఆశిష్ బెనర్జీ మమతా బెనర్జీ (Mamatha Benerjee)కి అత్యంత సన్నిహితుడు. విద్యార్థి దశ నుండే రాజకీయాలతో సంబంధం ఉన్నారు. ఆయన గతంలో ఉపాధ్యాయుడిగా కూడా పనిచేశారు. ఆయన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గానూ పనిచేశారు. మమతా బెనర్జీ ప్రభుత్వంలో విద్య, వ్యవసాయం వంటి శాఖల మంత్రిగా సేవలు అందించారు.
దీనిని కూడా చదవండి : Bandi Sanjay KTR | పదేళ్లు ఏం చేశారు.. కేటీఆర్‌కు బండి సంజయ్ కౌంటర్