అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Case | ఏసీబీ దూకుడు పెంచింది. అవినీతి అధికారుల పని పడుతోంది. లంచాలు తీసుకుంటున్న వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటుంది. తాజాగా ఏసీబీ అధికారులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
నాగర్‌కర్నూల్ (Nagar Kurnool) జిల్లా లింగాల అటవీ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ (ACB) అధికారులు సోదాలు చేశారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రామ్‌బాబు, బీట్ ఆఫీసర్ మురళీ కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఇద్దరు జులై 23న నల్లమల (Nallamala) అడవి నుంచి సేకరించిన కలపను తరలిస్తున్న ఓ వ్యక్తిని అడ్డుకున్నారు. లంచం ఇవ్వకపోతే అటవీ కేసు నమోదు చేస్తామని, ఎడ్ల బండ్లను జప్తు చేస్తామని బెదిరించారు.
ACB Case | రూ.1.20 లక్షల డిమాండ్
అటవీ శాఖ అధికారులు మొదట రూ.1.20 లక్షల లంచం డిమాండ్ చేశారు. సదరు వ్యక్తి బతిమిలాడటంతో దానిని రూ.50 వేలకు తగ్గించారు. బాధితుడు ఫోన్‌పే ద్వారా రూ. 28 వేలు, రూ. 22 వేలు నగదు రూపంలో చెల్లించాడు. ఆ తర్వాత, అధికారిక రసీదు జారీ చేయడానికి మళ్లీ అదనంగా రూ. 6 వేలు డిమాండ్ చేశారు. దీనిపై బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కార్యాలయంలో సోదాలు చేసిన అధికారులు నిందితులను అరెస్ట్ చేశారు.
ACB Case | భవన అనుమతి కోసం..
భవన నిర్మాణ అనుమతుల కోసం లంచం డిమాండ్ చేసిన అధికారిణిని ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. హైదరాబాద్ నగరంలోని సంతోషనగర్ సర్కిల్ (GHMC)లో సి ప్రభావతి టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ పని చేస్తున్నారు. ఓ వ్యక్తికి చెందిన భవన అనుమతి ఫైల్‌ను ప్రాసెస్ చేసి, అనుమతులు ఇవ్వడానికి రూ.20 వేల లంచం అడిగింది. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ మేరకు మంగళవారం ఫిర్యాదుదారుడి నుంచి రూ.20 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ప్రభావతిని వల పన్ని పట్టుకున్నారు.
దీనిని కూడా చదవండి : Kavitha Bhumi Lakshmi Scheme | పేదలకు ఎకరం భూమి ఇస్తాం.. కవిత సంచలన ప్రకటన