Revanth Reddy Social Justice | కేసీఆర్‌ది ఫ్యామిలీ జస్టిస్‌.. నాది సోషల్‌ జస్టిస్‌ : సీఎం రేవంత్​రెడ్డి

పదేళ్లు రాష్ట్రాన్ని ఏలినవారు ప్రజాపాలన గురించి దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revanth Reddy Social Justice | పదేళ్లు రాష్ట్రాన్ని ఏలినవారు ప్రజాపాలన గురించి దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. రాజ్యం వాళ్లు చేసి.. కులవృత్తులు చేసుకోవాలని గత పాలకులు మనకు చెప్పారన్నారు. కేసీఆర్‌ది ఫ్యామిలీ జస్టిస్‌ అయితే.. తనది సోషల్‌ జస్టిస్‌ అన్నారు. ఆయనది దొరల న్యాయం.. తనది సామాజిక న్యాయం అని పేర్కొన్నారు.

సర్దార్​ సర్వాయి పాపన్న గౌడ్​ జయంతి సందర్భంగా ట్యాంక్​బండ్​పై ఆయన విగ్రహాన్ని సీఎం రేవంత్​రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఇది బహుజనుల తెలంగాణ.. ఇందిరమ్మ పాలన.. సామాజిక న్యాయం, సమానమైన అవకాశాలు కల్పిస్తుందన్నారు. గీత కార్మికుల వృత్తిని కాపాడే బాధ్యత తమ ప్రభుత్వానిదని పేర్కొన్నారు. గ్రామాల్లో అర్హత ఉన్న ప్రతి నేత, గీత కార్మికుడికి పెన్షన్‌ ఇవ్వాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఇరిగేషన్‌ కాల్వలపై ఈత, తాటి చెట్లు పెంచుతామన్నారు. 2029లో మళ్లీ కాంగ్రెస్​ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 117 సీట్లు గెలుచుకుంటామన్నారు. గౌడ్​లు తమకు సహకరించాలని కోరారు. కల్లు కోసం వచ్చే వారికి తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గురించి చెప్పాలని కోరారు.

Revanth Reddy Social Justice | చెట్టుకు కట్టేసి కొట్టాలి

అఘోరా రావు కర్ణాటక, తమిళనాడుకి పోయి.. అఘోరాలతో కలిసి చేతబడి పూజలు చేయించాడని సీఎం అన్నారు. కరువు రావాలి, ప్రజలు చావాలి, రైతుల పంట పొలాలు ఎండిపోవాలని ఈ పూజలు చేయించాడని ఆరోపించారు. ఇలా చేతబడి చేసే వాళ్లను చెట్టుకు కట్టేసి కొట్టాలని వ్యాఖ్యలు చేశారు.

Revanth Reddy Social Justice | అబద్ధాలు ప్రచారం

బీసీల లెక్కలు తేల్చిన తొలి ప్రభుత్వం తమదే అని సీఎం అన్నారు. గత పాలకుల అప్పు తెలంగాణ పాలిట ముప్పుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్డీలు కడుతూనే పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. బావ, బావమరిదిలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రజాపాలన పోయి.. మళ్లీ దొరపాలన రావొద్దన్నారు. తనది, మహేశ్​ గౌడ్​ది వైఎస్​ఆర్​, డీఎస్​ కాంబినేషన్​ అని సీఎం పేర్కొన్నారు.

Revanth Reddy Social Justice | రేవంత్​ రెడ్డి కాదు.. గౌడ్​

పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్​ గౌడ్​ మాట్లాడుతూ.. రేవంత్​రెడ్డి కాదు గౌడ్​ అన్నారు. బహుజనుల అభివృద్ధికి రేవంత్ రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు. గౌడ్ లు తలుచుకుంటే మరో ఐదు సార్లు ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న నిరుపేద కుటుంబంలో పుట్టి గోల్కొండ కోటను జయించారని చెప్పారు. కళ్లు గీత కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. గీత కార్మికులను ప్రోత్సహించాలని కోరారు.

దీనిని కూడా చదవండి : ACB Case | అటవీ శాఖ అధికారులపై ఏసీబీ కేసు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *