Konda Surekha | మంత్రి కొండా సురేఖకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు!

వనపర్తిలో ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Konda Surekha | మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్‌ పార్టీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. సుస్మిత వ్యాఖ్యలపై మంత్రి సురేఖ వివరణ ఇవ్వాలని కమిటీ ఆదేశించింది. మూడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు సమాచారం.

Konda Surekha | సీఎంపై అనుచిత వ్యాఖ్యలు..

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై సుస్మిత చేసిన అనుచిత వ్యాఖ్యల వ్యవహారాన్ని పార్టీ క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ నుంచి వివరణ కోరింది.

ఇదే సమయంలో మాజీ మంత్రి చిన్నారెడ్డికి కూడా క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. వనపర్తిలో ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మూడు రోజుల్లోగా వివరణ సమర్పించాలని చిన్నారెడ్డికి సూచించింది.

ACB Trap Employee | ACB Trapలో ఉద్యోగి పట్టుబడితే వెంటనే ఉద్యోగం పోతుందా? నిబంధనలు ఏం చెబుతున్నాయి?

పార్టీ నేతల వ్యాఖ్యలు, పరస్పర విమర్శలపై అధిష్ఠానం క్రమశిక్షణ చర్యలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ నోటీసులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *