ACB Raids on Tahsildar | తహశీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు

ఇబ్రహీంపట్నం తహశీల్దార్ శ్రీనివాస్​రెడ్డి​ నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: ACB Raids on Tahsildar | హైదరాబాద్​ (Hyderabad) నగరంలోని ఇబ్రహీంపట్నం తహశీల్దార్​ నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఏకకాలంలో 16 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు.

ACB Raids on Tahsildar | అక్రమాస్తుల కేసు..

తహశీల్దార్​ శ్రీనివాస్​రెడ్డిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆయన భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీకి ఫిర్యాదులు అఆదాయి. ఈ మేరకు కేసు నమోదు చేసిన అధికారులు గురువారం ఉదయం ఆయన నివాసం, కార్యాలయంతో పాటు 14 చోట్ల సోదాలు చేశారు. ఆయన గతంలో మహేశ్వరం తహశీల్దార్​గా పని చేశారు. సోదాల అనంతరం అక్రమాస్తులపై అధికారులు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

ACB Raids on Tahsildar | ఏసీబీ దూకుడు

రాష్ట్రంలో ఇటీవల ఏసీబీ దూకుడు పెంచింది. అవినీతి అధికారుల భరతం పడుతోంది. ముఖ్యంగా ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన వారి బాగోతం బయట పెడుతోంది. లంచాలు తీసుకొని రూ.వందల కోట్లు సంపాదించిన అధికారులపై కేసులు నమోదు చేస్తోంది. అంతేగాకుండా ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు లంచం తీసుకుంటున్న అధికారులను రెడ్ హ్యాండెడ్​గా పట్టుకుంటుంది. అయితే ఏసీబీ కేసులు నమోదు అవుతున్నా.. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవడంతో లంచాలకు మరిగిన అధికారులు భయపడటం లేదు.

ఇది కూడా చదవండి..: ABVP Kukatpally Town | ఏబీవీపీ కూకట్‌పల్లి నగర అధ్యక్షుడిగా నిఖిల్​.. కార్యదర్శిగా రఘు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *