అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Women Rights Awareness | మహిళలు, బాలికలు తమ హక్కులపై (women rights) అవగాహన ఉండాలని భరోసా సెంటర్ ఎస్సై పుష్పావతి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా భరోసా సెంటర్ (Bharosa Center) ఆధ్వర్యంలో చైల్డ్ సేఫ్టీ కార్యక్రమాన్ని (Child Safety Program) బోర్గాం(పి) పంచాయతీ పరిధిలో, డీఆర్డీఏ ఐకేపీ మండల సమాఖ్యలో నిర్వహించారు. సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో బోర్గాం(పి) కార్పొరేటర్ నరేష్ అతిథిగా హాజరయ్యారు.
Women Rights Awareness | సైబర్ నేరాలు.. బాల్యవివాహాల నిర్మూలన..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళల భద్రత, బాలల రక్షణ, లింగ సమానత్వం, జెండర్ బయాస్ (Gender Bias), సైబర్ నేరాల నివారణ, బాల్య వివాహాల నిర్మూలన (Child Marriage), భరోసా సెంటర్ సేవలపై అవగాహన కల్పించారు. మహిళలు, బాలికలు తమ హక్కులపై అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని, పితృస్వామ్య భావనలు, జెండర్ వివక్షను గుర్తించి ఎదుర్కోవాలని సూచించారు. సైబర్ మోసాలపై జాగ్రత్తలు తీసుకోవాలని, బాల్యవివాహాల నివారణలో ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం శారద, కో-ఆర్డినేటర్ రోజా, సపోర్ట్ పర్సన్ సవిత, ఏఎన్‌ఎం మమత, ఆర్పీలు, అంగన్వాడీ టీచర్లు, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Collectorate Parking Fire | కలెక్టరేట్ పార్కింగ్‌లో మంటలు..

