అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Ponguleti Srinivas Reddy Visit | రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం నిజామాబాద్‌లో (Nizamabad) పర్యటించనున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ భవేష్ పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు.
Ponguleti Srinivas Reddy Visit | నాగారంలో హౌసింగ్ టవర్స్..
నాగారంలోని నిర్మితి కేంద్రం వద్ద హౌసింగ్ టవర్స్ నిర్మాణం కోసం ఉదయం 7గంటలకు మంత్రి స్థల పరిశీలన జరపనున్నారు. అనంతరం 43వ డివిజన్ పాములబస్తీలో ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) నిర్మాణాలను పరిశీలించి, లబ్ధిదారులతో భేటీ కానున్నారు. ఉదయం 10.00 గంటలకు రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు పత్రాలను పంపిణీ చేయనున్నారు. అక్కడి నుండి గూపన్‌పల్లికి చేరుకొని తహశీల్దార్ కార్యాలయాలు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అదేవిధంగా దుబ్బ ప్రాంతంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణాలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.
Ponguleti Srinivas Reddy Visit | ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష
ఉదయం 11.45 గంటల ప్రాంతంలో కలెక్టరేట్‌కు చేరుకుని హౌసింగ్, రెవెన్యూ అంశాలపై ఉమ్మడి జిల్లాల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహిస్తారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారులు పి.సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పర్యటనను పురస్కరించుకుని కలెక్టర్ భవేష్ మిశ్రా శుక్రవారం సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. అదనపు కలెక్టర్ భుజంగరావు,ట్రైనీ కలెక్టర్ సురేష్, డీఆర్వో గీత, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఆర్డీవో రాజేంద్రకుమార్, ట్రైనీ ఆర్డీవో సందీప్ తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి: Alaska Plane Crash | ఘోర విమాన ప్రమాదం.. ఎనిమిది మంది మృతి