అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Chandanagar SI | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని చందానగర్ ఎస్సై బాలరాజు (SI Balaraju) లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ల్యాండ్ సెటిల్మెంట్ విషయంలో బాధితుడి నుంచి ఎస్సైతో పాటు కానిస్టేబుల్ రాఘవేంద్ర కుమార్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Chandanagar SI | రూ.75 వేలు తీసుకుంటుండగా..
ఎస్సై బాలరాజుతో పాటు కానిస్టేబుల్ రాఘవేంద్ర కుమార్‌ను ఏసీబీ (ACB) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరు ఫిర్యాదుదారుడి నుంచి గతంలో రూ.25 వేలు తీసుకున్నారు. తాజాగా మరో రూ.75 వేలు తీసుకుంటుండగా ఏసీబీ వల పన్ని పట్టుకుంది. అనంతరం పోలీస్ స్టేషన్లో అధికారులు తనిఖీలు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల కామారెడ్డి జిల్లా రాజంపేట ఎస్సై లంచం తీసుకుంటూ చిక్కాడు. నిత్యం ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. రోజుకో అధికారి పట్టుబడుతున్నాడు. అయినా లంచాలకు మరిగిన వారు మాత్రం భయపడటం లేదు. ఏసీబీకి చిక్కినా.. కఠిన చర్యలు లేకపోవడంతో లంచాలు తీసుకోవడం మానడం లేదు.
దీనిని కూడా చదవండి : HYDRAA Commissioner | అంజయ్యనగర్‌లో అక్రమ నిర్మాణాలన్నీ తొలగిస్తాం : హైడ్రా కమిషనర్