అక్షరటుడే, వెబ్‌డెస్క్: IND vs SL 2nd Test | భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న సిరీస్‌లో భాగంగా రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్.. మొదట బ్యాటింగ్ ఎంచుకుని సానుకూల ఆరంభాన్ని దక్కించుకుంది. ఆరంభంలోనే రెండు వికెట్లు పడినా.. పడిక్కల్ సెంచరీతో రాణించాడు. 77 ఓవర్లకు భారత్ స్కోరు 287/4. ధ్రువ్ జురెల్ (5), రవీంద్ర జడేజా (36) క్రీజులో ఉన్నారు.
IND vs SL 2nd Test | ఇద్దరు ఓపెనర్లను కోల్పోయినా..
ఆట ఆరంభంలోనే భారత్ తన ఇద్దరు ఓపెనర్లను కోల్పోయినప్పటికీ, దేవదత్ పడిక్కల్ మరియు శుభ్‌మన్ గిల్ అద్భుత ప్రదర్శనతో జట్టుకు అండగా నిలిచారు. వన్ డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (117, 193 బంతుల్లో) ఔటయ్యాడు. బ్యాటింగ్‌లో రాణించిన భారత జట్టు.. శ్రీలంక బౌలర్లకు సవాల్ విసిరింది.
సిరీస్‌లోని మొదటి టెస్ట్‌లో భారత్ బ్యాటింగ్ మరియు బౌలింగ్ విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించింది. శ్రీలంకపై 165 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసిందన్న విషయం తెలిసిందే. ఆతిథ్య జట్టుపై అన్ని రంగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించిన భారత్.. రెండో టెస్ట్‌లోనూ అదే జోరును కొనసాగించాలని చూస్తోంది.
ఇది కూడా చదవండి..: Doval Beijing Tour | రేపు బీజింగ్‌కు NSA అజిత్ దోవల్..