అక్షరటుడే, వెబ్డెస్క్: CM Revanth Reddy | విదేశీ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్రెడ్డి సోమవారం ఉదయం హైదరాబాద్కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో ఆయనకు అధికారులు, కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు.
సీఎం రేవంత్రెడ్డి లండన్, అమెరికా పర్యటన కోసం ఇటీవల బయలుదేరిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆయన లండన్ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి తిరిగి వచ్చారు. హైదరాబాద్కు వచ్చాక అన్ని విషయాలపై మాట్లాడతానని సీఎం ఇప్పటికే తెలిపారు. దీంతో ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.
CM Revanth Reddy | కొండా సురేఖపై చర్యలు ఉంటాయా..
సీఎం రేవంత్రెడ్డి లండన్ పర్యటనలో ఉన్న సమయంలో రాష్ట్ర కాంగ్రెస్లో విభేదాలు బయటపడ్డాయి. ఓ వైపు మంత్రి కొండా సురేఖ (Konda Surekha) కూతురు సుష్మిత సీఎంపై ఆరోపణలు చేయడం తీవ్ర కలకలం రేపింది. దీంతో సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలని పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. సీఎం హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో ఈ విషయమై చర్చించే అవకాశం ఉంది. అలాగే పార్టీలో ఇతర నేతల మధ్య విభేదాలపై సైతం ఆయన నిర్ణయం తీసుకుంటారని సమాచారం. మరోవైపు 22ఏ నిషేధిత జాబితా భూముల వ్యవహారం ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలిగిస్తోంది. ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సీఎం దీనిపై సైతం ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి..: BRS 1000 Days Protest | కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ సమరభేరి.. సెప్టెంబరు 2 నుంచి రాష్ట్రవ్యాప్త నిరసనలు