Governor Shiv Pratap | ఇందూరుకు చేరుకున్న రాష్ట్ర గవర్నర్​ శివ్​ ప్రతాప్​ శుక్లా

రాష్ట్ర గవర్నర్ సి.శివ్ ప్రతాప్ శుక్లా జిల్లాకు చేరుకున్నారు. ఆయనకు ఎంపీ అర్వింద్​ స్వాగతం పలికారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Governor Shiv Pratap | రాష్ట్ర గవర్నర్ సి.శివ్ ప్రతాప్ శుక్లా జిల్లాకు చేరుకున్నారు. ఉదయం 10.30 గంటలకు హెలికాప్టర్‌ ద్వారా చేరుకోగా ఆయనతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్ వచ్చారు.

Governor Shiv Pratap | స్వాగతం పలికిన ఎంపీ

Governor Shiv Pratap

గవర్నర్​కు ఎంపీ ధర్మపురి అర్వింద్​ (MP Arvind) సాదర స్వాగతం పలికారు. ఆనంతరం ఎమ్మెల్యేలు ధన్​పాల్ సూర్యనారాయణ గుప్తా, పైడి రాకేష్ రెడ్డి, కలెక్టర్ భవేష్ మిశ్రా, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ట్రైనీ కలెక్టర్ సురేష్ తదితరులు పూలమొక్కలు అందించి స్వాగతం పలికారు. అక్కడి నుండి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ కాన్వాయ్ ద్వారా గవర్నర్ రోడ్లు భవనాల శాఖ అతిథి గృహానికి చేరుకోగా, పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.

Governor Shiv Pratap

Governor Shiv Pratap

 

ఇది కూడా చదవండి..: Snake Bite Death | ఎడపల్లిలో విషాదం.. పాముకాటుతో వ్యక్తి మృతి

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *