అక్షరటుడే,నిజామాబాద్ సిటీ: Double Bedroom Houses | బీఆర్ఎస్ (BRS) హయాంలో కేసీఆర్ కట్టించిన ఇళ్లను ఇందిరమ్మ ఇళ్లుగా ఎలా పేరు మారుస్తారని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా (Ex MLA Bigala Ganesh Gupta) ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని (Nizamabad ) నాగారంలో డబుల్బెడ్రూం ఇళ్లను ఆయన మంగళవారం పరిశీలించారు.
Double Bedroom Houses | నాగారంలో 396 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు..
నాగారం ప్రాంతంలో డబుల్ ఇళ్లతో పాటు సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ ట్యాంక్, విద్యుత్, ఓపెన్ జిమ్, పార్కు స్థలం వంటి అన్ని మౌలిక వసతులు కల్పించామని బిగాల పేర్కొన్నారు. అయితే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి చేశామన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా ఇళ్ల పంపిణీ నిలిచిపోయిందన్నారు. అయితే కాంగ్రెస్ సర్కారు వచ్చాక కేసీఆర్ నిర్మించిన ఇళ్లను ఇందిరమ్మ ఇళ్లుగా చిత్రీకరించడం సరికాదన్నారు. కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో ఇళ్లలో తలుపులు, కిటికీలు, దర్వాజాలు, ప్లంబింగ్, విద్యుత్ వైర్లు ధ్వంసమయ్యాయన్నారు. మరమ్మతులు చేయకుండానే ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించారని విమర్శించారు.
ప్రస్తుతం ఇళ్లు నివాసయోగ్యం కాని పరిస్థితిలో ఉన్నాయని ఆవేదన చెందారు. వెంటనే నిధులు కేటాయించి ఇళ్లను నివాసయోగ్యంగా మార్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్, సిర్ప రాజు, మాజీ నుడా ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సత్యప్రకాశ్, సుజిత్, గాండ్ల లింగం, ప్యాట సంతోష్, తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: డిజిటల్ మీడియాకు ఎంతో ప్రాముఖ్యతDr .సతీష్ కుమార్,రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్