Suryapet Road Accident | సూర్యాపేట రోడ్డు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి

సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Suryapet Road Accident | సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోదాడ మండలం ద్వారకుంట దగ్గర కంటైనర్‌ను ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట శివారులో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌ నుంచి ఏలూరు వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. రహదారి పక్కన ఆగి ఉన్న కంటైనర్ లారీని వెనుక నుంచి ఢీ బలంగా కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Suryapet Road Accident | అండగా ఉంటాం

సూర్యాపేట రోడ్డు ప్రమాద ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రమాదంలో గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఇది కూడా చదవండి..: Heavy Rain Alert | రాష్ట్రానికి నేడు భారీ వర్ష సూచన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *