Harish Rao | భూములు కబ్జా చేస్తున్న సీఎం రేవంత్​రెడ్డి : హరీశ్​రావు

సీఎం రేవంత్​రెడ్డి 22ఏ జాబితా పేరుతో భూములను కబ్జా చేస్తున్నారని హరీశ్​రావు ఆరోపించారు.

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Harish Rao | మాజీ మంత్రి, ​ఎమ్మెల్యే హరీశ్​రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్​రెడ్డి కబ్జాదారుడు అన్నారు. కూకట్​పల్లిలో నిర్వహించిన 22ఏ బాధితుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కబ్జాదారులే 22Aకి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అంటున్నారని హరీశ్​రావు అన్నారు. కష్టపడి సంపాదించి ఆస్తులు కొనుగోలు చేసుకున్న ప్రజలు కబ్జాదారులు కాదని, వారి ఆస్తులను కబ్జా చేసేందుకు కుట్ర చేస్తున్న సీఎం అసలైన కబ్జాదారుడని ఆరోపించారు. ప్రజల భూములపై పెత్తనం చేయడం కాదు, వారి హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను అమ్ముకుంటూ, అసైన్డ్ భూములను సీఎం లాక్కుంటున్నారని మండిపడ్డారు.

Harish Rao | రాత్రికి రాత్రి 22ఏ జాబితాలోకి..

రాత్రికి రాత్రి భూములను నిషేధిత జాబితాలో పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వమే కబ్జాదారు మారిందని హరీశ్​రావు విమర్శించారు. కష్టపడి సంపాదించిన డబ్బులు పెట్టి కట్టుకున్న ఇళ్ళల్లో 40,50 ఏళ్ల నుండి జీవిస్తున్న ఈ ప్రజలు కబ్జాదారులా అని ఆయన ప్రశ్నించారు. 2008లో నాటి సీఎం రాజశేఖర్ రెడ్డి ULC భూములను రద్దు చేశారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ప్రజల భూములు 2008 కంటే ముందు ULC(అర్బన్ ల్యాండ్ సీలింగ్)లో ఉన్నాయని నిషేధిత జాబితాలో పెట్టారన్నారు.

Harish Rao | అధికారుల చుట్టూ ప్రదక్షిణలు

తన ఇంటిని 22A జాబితాలో పెట్టారని, తెలంగాణ భవన్‌కు ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వచ్చాడని హరీశ్​రావు తెలిపారు. అతను గత నెల 3న MRO దగ్గరకు వెళ్లి దరఖాస్తు పెట్టుకున్నాడని చెప్పారు. చాలా రోజులు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశాక.. 28వ తేదీన MROని కలిస్తే.. అప్లికేషన్ తన దాకా రాలేదని చెప్పారన్నారు. ఆర్డీవో ఆఫీస్‌కి వెళ్తే.. కలెక్టర్‌ను కలవమని చెప్పారని, కలెక్టర్‌ని కలిస్తే.. ఇది తన చేతిలో లేదన్నారు. అయితే కమీషన్లు ఇస్తే 22ఏ జాబితా నుంచి భూములను తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఇది కూడా చదవండి..: Konda Surekha | కొండా సురేఖ వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ నివేదిక

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *